బాలీవుడ్‌ నటి అలియాభట్‌ పై రష్మిక ప్రశంసలు.. 'జిగ్రా'లో నీ నటన అమోఘం.. నువ్వు కేక: అలియాకు అంటూ  కితాబు!

బాలీవుడ్‌ నటి అలియాభట్‌ పై రష్మిక ప్రశంసలు.. 'జిగ్రా'లో నీ నటన అమోఘం.. నువ్వు కేక: అలియాకు అంటూ కితాబు!

2 months ago | 5 Views

బాలీవుడ్‌ నటి అలియాభట్‌ పై నటి రష్మిక ప్రశంసల వర్షం కురిపించారు. యాక్టింగ్‌లో అలియా టాలెంట్‌, కథల ఎంపికను ఆమె మెచ్చుకున్నారు. విభిన్నమైన కథలను తరచూ ప్రేక్షకులకు అందిస్తున్నందుకు ధన్యవాదాలు చెప్పారు. ఈ మేరకు తాజాగా ఇన్‌స్టా స్టోరీస్‌ వేదికగా పోస్ట్‌ పెట్టారు. అలియా భట్‌, వేదాంగ్‌ నటించిన 'జిగ్రా’ చూశా. సినిమా అద్భుతంగా ఉంది. నటీనటులు, చిత్రబృందాన్ని గట్టిగా హత్తుకుని మెచ్చుకోకుండా ఉండలేకపోయా. అలియా.. నువ్వు మాకు దొరకడం ఓ వరం. నీ టాలెంట్‌ని చూసే అవకాశం మాకు ఇచ్చినందుకు థాంక్యూ. వేదాంగ్‌ నువ్వు మరెన్నో చిత్రాలు నటిస్తే చూడాలనుకుంటున్నా. రాహుల్‌.. నువ్వు నన్నెంతో సర్‌ప్రైజ్‌ చేశావు.

నీకు, ’జిగ్రా’లో నువ్వు పోషించిన మత్తు పాత్రకు చాలా వ్యత్యాసం ఉంది. వాసన్‌ బాలా.. మేకింగ్‌ చాలా బాగుంది. ఇంకెన్నో విషయాలు చెప్పాలని ఉంది. చిత్రబృందం మొత్తానికి నా అభినందనలు అని రష్మిక రాసుకొచ్చారు. బాలీవుడ్‌ నటీనటులు అలియాభట్‌ , వేదాంగ్‌ రైనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం'జిగ్రా’ యాక్షన్‌ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి వాసన్‌ బాలా దర్శకత్వం వహించారు. కరణ్‌ జోహార్‌ నిర్మాత. తమ్ముడు కోసం అక్క చేసే పోరాటం నేపథ్యంలో ఇది సిద్ధమైంది. శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకువచ్చింది. సినీ తారల కోసం ముంబయిలో 'జిగ్రా’ స్పెషల్‌ షో వేశారు. దీనికి రష్మిక హాజరైన విషయం తెలిసిందే. ఏషియన్‌ సురేశ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రానా తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేశారు. సినిమా విడుదల సందర్భంగా మహేశ్‌బాబు చిత్రబృందానికి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు.

ఇంకా చదవండి: డిసెంబర్ 20న ప్రియదర్శి 'సారంగపాణి జాతకం' విడుదల

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !

# AliaBhatt     # RashmikaMandanna    

trending

View More