'ఛావా' ప్రీ రిలీజ్ వేడుకల్లో రష్మిక.. అల్లు అర్జున్‌తో నా ఎనర్జీ సరిపోతుందని వ్యాఖ్య
1 month ago | 5 Views
ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతోంది రష్మిక. తెలుగుతో పాటు బాలీవుడ్‌లోనూ సినిమాలను చేస్తూ తీరిక లేకుండా గడుపుతోంది. విక్కీ కౌశల్ కీలక పాత్రలో లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో రూపొందిన హిస్టారికల్ ఎపిక్ యాక్షన్ ఫిల్మ్ ’ఛావా’ రష్మిక కథానాయిక. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా రష్మిక ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఇటీవల కాలంలో ఆమెతో కలిసి నటించిన హీరోల గురించి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. 'గొప్ప కథల్లో భాగమవడం నాకెంతో ఇష్టం. ఆ సినిమాను ప్రేక్షకులు చూసి, దాని గురించి మాట్లాడుతుంటే, మరింత సంతోషంగా ఉంటుంది. అలాంటి కథల్లోనే నటించాలనుకుంటా.
నేను తెరపై కనిపించినంతసేపు ప్రేక్షకుల దృష్టి నాపై ఉండేలా చేయగలను. అదే సమయంలో ఆ సన్నివేశంలో ఎవరు నటిస్తున్నారన్న విషయాన్ని పట్టించుకోను‘ అని చెప్పుకొచ్చింది. తన సహ నటుల గురించి మాట్లాడుతూ వారిపై ప్రశంసలు కురిపించింది. విక్కీ కౌశల్, అల్లు అర్జున్, రణ్‌బీర్ కపూర్‌లతో కలిసి పనిచేయడం ఎంతో సంతోషంగా అనిపించిందని తెలిపింది. ‘ఇటీవల నేను చేసిన సినిమాల్లోని కో-స్టార్స్ అందరూ ఎంతో మంచి వ్యక్తులు. స్నేహభావంతో, ఎదుటివారికి ఇబ్బంది కలగకుండా వ్యవహరిస్తారు. ముఖ్యంగా అల్లు అర్జున్ సర్‌తో నా ఎనర్జీ పర్‌ఫెక్ట్‌గా మ్యాచ్ అవుతుంది. ఆయనతో నటించడం ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ఇక రణ్‌బీర్‌కు నాకూ నాన్సెన్స్ నచ్చదు. కేవలం పాత్రల గురించి తప్ప ఇతర విషయాలేవీ మాట్లాడుకోం. అంతా ప్రొఫెషనల్‌గా ఉంటాం. చివరిగా విక్కీ కౌశల్ అద్భుతమైన వ్యక్తి. ఇలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు. వాళ్లతో కలిసి పనిచేయడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది‘ అంటూ తెలిపింది రష్మిక. మరోవైపు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ’ది గర్ల్‌ఫ్రెండ్’, సల్మాన్‌ఖాన్-మురుగదాస్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ’సికిందర్’, అలాగే ధనుష్-శేఖర్ కమ్ముల ఫిల్మ్ ’కుబేర’ చిత్రాల్లో రష్మిక నటిస్తోంది.
ఇంకా చదవండి: 'దబిడిదిబిడి' పాట కొరియోగ్రఫీపై విమర్శలు ... ఇలా వస్తాయని ఊహించలేదంటున్న ఊర్వశి రౌతేలా
"Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!"