మీ సినిమా హిట్ కొట్టడం ఖాయం.. పార్టీ ఇవ్వాల్సిందేననన్న రష్మిక మందన్నా!!

మీ సినిమా హిట్ కొట్టడం ఖాయం.. పార్టీ ఇవ్వాల్సిందేననన్న రష్మిక మందన్నా!!

3 months ago | 13 Views

టాలీవుడ్‌ నటుడు విజయ్‌ దేవరకొండ  మృణాళ్‌ ఠాకూర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం 'ఫ్యామిలీ స్టార్‌’ . పరశురాం  ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్‌ 05న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో మేకర్స్‌ ట్రైలర్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే.


తాజాగా ఈ ట్రైలర్‌పై రష్మిక ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టింది.'ఫ్యామిలీ స్టార్‌’ చాలా బాగుంది. నాకు చాలా ఇష్టమైన విజయ్‌ దేవరకొండ, పరశురామ్‌.. 'ఫ్యామిలీ స్టార్‌’ సినిమాతో విజయం సాధించాలని కోరుకుంటున్నా. ఏప్రిల్‌ 5 కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నా. విూరు తప్పకుండా హిట్‌ కొడతారు. హిట్‌ కొట్టిన తర్వాత నాకు పార్టీ కావాలని అంటూ రష్మిక పోస్ట్‌ పెట్టింది. కాగా దీనిపై విజయ్‌ రిప్లయ్‌ ఇస్తూ క్యూటెస్ట్‌ అంటూ పెట్టాడు. కాగా ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ విూడియాలో వైరల్‌గా మారింది.

ఇంకా చదవండి: వేసవి ఆటవిడుపు... విదేశాలకు వెళ్లిన రామ్‌చరణ్‌!

# Familystar     # Vijaydeverakonda     # Mrunalthakur