రష్మిక మందన్న తన సూపర్-బిజీ షెడ్యూల్‌లో; ప్రముఖ స్టార్ పలు హై ప్రొఫైల్ ప్రాజెక్ట్‌లను హ్యాండిల్ చేస్తున్నారు.
1 month ago | 5 Views
ఒకప్పుడు అగ్ర కథానాయికలు రెండు, మూడు షిఫ్ట్‌ల్లో పనిచేసేవారు. తమ వల్ల సినిమా షెడ్యూల్స్‌కు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకునేవారు. ఇప్పుడు అలాంటి అంకితభావం ఉన్న నాయికలు చాలా అరుదనే చెప్పాలి. ప్రస్తుతం కన్నడ భామ రష్మిక మందన్న సైతం అదే తరహాలో రెండు షిఫ్ట్‌ల్లో పనిచేస్తూ బిజీగా ఉంది. ఆమె కథానాయికగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప-2’ డిసెంబర్ 5న విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో రష్మిక మందన్న ఈ సినిమా విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది.
అదే సమయంలో ఆమె సల్మాన్‌ఖాన్ సరసన నటిస్తున్న ‘సికందర్’ సినిమా షూటింగ్ సైతం ప్రస్తుతం హైదరాబాద్‌లోనే జరుగుతున్నది. ఈ సినిమాల కోసం రెండు షిఫ్ట్‌ల్లో పనిచేస్తున్నదట రష్మిక మందన్న. ‘పుష్ప’ చిత్రంలో ఆమె పోషించిన శ్రీవల్లి పాత్రకు యువతరంలో మంచి క్రేజ్ దక్కింది. ఈ నేపథ్యంలో సీక్వెల్‌లో ది బెస్ట్ పర్‌ఫార్మెన్స్ ఇవ్వాలనే తపనతో పనిచేస్తున్నదట రష్మిక. వర్క్ విషయంలో ఆమె అంకితభావాన్ని చూసిన యూనిట్ సభ్యులు ఫిదా అవుతున్నారట. ప్రస్తుతం రష్మిక మందన్న తెలుగులో కుబేర, రెయిన్‌బో, ది గర్ల్‌ఫ్రెండ్ చిత్రాలతో బిజీగా ఉంది.
ఇంకా చదవండి: నిజజీవితంలో తల్లి కావాలని ఉంది : సమంత
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !
# రష్మికమందన్న # పుష్ప2 # సికందర్ # కుబేర