అమెజాన్‌ లో రానున్న రానా సరికొత్త షో..!

అమెజాన్‌ లో రానున్న రానా సరికొత్త షో..!

2 months ago | 24 Views

ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి తెలుగులో సినిమా చేసి చాలా కాలం అయింది. 2022 లో పవన్‌ కళ్యాణ్‌ తో చేసిన ’భీమ్లా నాయక్‌’ తరువాత వచ్చిన ’విరాట పర్వం’ విడుదలైన తరువాత, రానా తెలుగు సినిమా చెయ్యలేదు. సుమారు రెండు సంవత్సరాలకి పైగా అయింది, రానా తెలుగు సినిమా వొప్పుకొని. అయితే ఇప్పుడు రానా దగ్గుబాటి తమిళ సినిమా చేస్తున్నారు. రజినీకాంత్‌ కథానాయకుడిగా నటిస్తున్న ’వెట్టియాన్‌’ లో రానా విలన్‌ గా నటిస్తున్నాడు. దీనికి ’జై భీం’ ఫేమ్‌ టిజె జ్ఞానవేల్‌ దర్శకుడు. ఈ సినిమా చిత్రీకరణ ఇంకా కొంచెం మిగిలి వుంది అని తెలిసింది. ఇదిలా ఉండగా రానా దగ్గుబాటి ఈమధ్య చాలా చిన్న సినిమాలని ప్రోత్సహిస్తున్నాడు. ఇంతకు ముందు ’పరేషాన్‌’ అనే సినిమాని ప్రోత్సహించినట్టుగానే ఇప్పుడు ’35’ అనే సినిమాకి రానా ముందుండి నడిపిస్తున్నాడు. అలాగే మలయాళం సూపర్‌ స్టార్‌ దుల్కర్‌ సల్మాన్‌ తో ఒక సినిమా నిర్మిస్తున్నాడు రానా.

ఈ సంవత్సరం ఈ సినిమా చిత్రీకరణ మొదలవుతుందని తెలుస్తోంది.  ఇవి కాకుండా రానా దగ్గుబాటి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో కోసం ఒక షో చేస్తున్నట్టుగా తెలిసింది. ఈ షో కి ’ది రానా కనెక్షన్‌’ అని పిలుస్తున్నారు. ఇందులో రానా దగ్గుబాటి దక్షిణాదికి చెందిన అగ్ర నటులను ఒక దగ్గరకి చేర్చి వారితో సంభాషించనున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇంతకు ముందు నటులతో చాలా షో లు వచ్చినా, రానా ఇది తన మార్కు వుండేటట్టుగా ఒక అద్భుతమైన కాన్సెప్ట్‌ తో వెళుతున్నట్టుగా తెలిసింది. ఈ షో కోసమని రామానాయుడు స్టూడియో లో ఒక సెట్‌ కూడా తయారవు తోంది అని వినికిడి. అలాగే కొన్ని తెలుగు సినిమాలు కూడా ఈ సంవత్సరం ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇవన్నీ కాకుండా ’రానా నాయుడు’ వెబ్‌ సిరీస్‌ రెండో సీజన్‌ చిత్రీకరణ జరుగుతోంది. ఇందులో తన చిన్నాన్న వెంకటేష్‌ తో నటిస్తున్న సంగతి తెలిసిందే. మొదటి సీజన్‌ అద్భుతమైన విజయం సాధించింది.

ఇంకా చదవండి: ఇద్దరు సీఎంల భేటీలో తెలుగు చిత్ర పరిశ్రమ సమస్యలపై చర్చించాలి - టీఎఫ్ సీసీ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్

# RanaDaggubati     # TheRanaConnection     # AmazonPrimeVideo     # TeluguCinema    

trending

View More