'మిస్టర్ బచ్చన్'పై రానా సెటైర్లు
1 month ago | 5 Views
ఇండియన్ సినీ పరిశ్రమలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఐఫా అవార్డుల వేడుక యూఏఈ రాజధాని అబుదాబిలో గత నెల అంగరంగా వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. కాగా దీనికి సంబంధించిన ఫుల్ వీడియోను ఐఫా నిర్వాహకులు తాజాగా విడుదల చేశారు. ఇక ఈ అవార్డుల వేడుకలో దగ్గుబాటి రానాతో పాటు 'హనుమాన్' సినిమా ఫేం తేజ సజ్జా హోస్ట్‌లుగా చేసి సినీ తారలతో పాటు ప్రేక్షకులను అలరించారు. అయితే ఈ వేడుకలో రానా, తేజ సజ్జా రవితేజ 'మిస్టర్ బచ్చన్' సినిమాపై పంచ్‌లు వేయగా.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఈ ఏడాది హైయెస్ట్ హై చూసారు. లోయెస్ట్ లో కూడా చూసారు అంటూ అనగా.. తేజ సజ్జా ఉండి.. హైయెస్ట్ హై కల్కి.. మరి లోయెస్ట్ లో అనగానే రానా ఉండి 'మిస్టర్ బచ్చన్' అంటూ కామెంట్ చేశాడు. దీంతో ఈ సెటైర్ బాగా పేలింది.
సోషల్ మీడియాలో కూడా ఎక్కడ చూసినా ఇదే కనిపిస్తుంది. అయితే ఈ విషయం హరీశ్ శంకర్ వద్దకు కూడా చేరగా.. దీనిపై రిప్లయ్ ఇచ్చాడు. ఒక అభిమాని ఈ వీడియోను పోస్ట్ చేస్తూ.. మళ్లీ రవితేజతో హిట్టు ఎప్పుడు కొడతావు అన్న అంటూ హరీశ్ శంకర్‌ను ట్యాగ్ చేశాడు. దీనికి హరీశ్ సమాధానమిస్తూ.. ఎన్నో విన్నాను తమ్ముడు అందులో ఇది ఒకటి. అన్ని రోజులూ ఒకేలా ఉండవు నాకైనా ఎవరికైనా అంటూ రాసుకొచ్చాడు. దీంతో ఇది చూసిన నెటిజన్లు హర్ట్ అయినట్లు ఉన్నాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇంకా చదవండి:జితేందర్ రెడ్డి టీమ్ ను అభినందించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి