బాలయ్యతో రామ్ చరణ్ సందడి!
2 days ago | 5 Views
నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సూపర్ హిట్ టాక్ షో ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’. ఇప్పటికే మూడు సీజన్‌లు విజయవంతంగా కంప్లీట్ చేసుకున్న ఈ షో నాలుగో సీజన్‌లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో ఇప్పటికే పలువురు స్టార్స్ సందడి చేశారు. తాజాగా ఈ షోలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సందడి చేసేందుకు రెడీ అయ్యారు. ఇందులో భాగంగా షో షూటింగ్‌లో రామ్ చరణ్ పాల్గొన్నారు. ‘సంక్రాంతికి వస్తున్నాం. డాకు మహారాజ్, గేమ్ ఛేంజర్‌తో ఇండస్ట్రీకి గ్రాండ్ సక్సెస్ ఇవ్వబోతున్నాం’ అంటూ బాలకృష్ణ తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. నాలుగో సీజన్‌లో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు, అల్లు అర్జున్, తమిళ నటుడు సూర్యలతో పాటు నవీన్ పొలిశెట్టి, వెంకటేశ్ తదితరులు వచ్చి సందడి చేసిన విషయం తెలిసిందే.
దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత సురేశ్ బాబు వంటి వారు కూడా పాల్గొని వారి సినిమా ప్రమోషన్ చేశారు. ఇప్పుడు చరణ్ సందడి చేయబోతున్నారు. ఇది తెలుసుకున్న మెగా అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దిగ్గజ దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం 'గేమ్ ఛేంజర్'. ఈ సినిమాను అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మిస్తుండగా.. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.
ఇంకా చదవండి: తన వల్లే ఈ అవకాశం వచ్చింది: సమంతకు థాంక్స్ చెప్పిన కీర్తిసురేష్