నితిన్ 'రాబిన్ హుడ్'లో రాజేంద్రప్రసాద్!
5 months ago | 34 Views
టాలీవుడ్ యాక్టర్ నితిన్ నటిస్తోన్న సినిమాల్లో ఒకటి 'రాబిన్‌హుడ్'. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. లేడీ బాస్ శ్రీలీల స్టైలిష్ అవతార్‌లో హ్యాండ్ బ్యాగ్ వేసుకుని విమానంలో నుంచి దిగుతున్న స్టిల్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మూవీలో నటకిరిటీ రాజేందప్రసాద్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా నటకిరీటికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఆయన లుక్ షేర్ చేశారు. ఇందులో ఏజెంట్ జాన్ స్నోగా కనిపించబోతున్నట్టు తెలియజేస్తూ రిలీజ్ చేసిన స్టైలిష్ లుక్ నెట్టింట వైరల్ అవుతోంది.
ఇప్పటికే డబ్బు చాలా చెడ్డది.. రూపాయి రూపాయి నువ్వేం చేస్తావే అంటే అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల మధ్య చిచ్చు పెడతానంటది. అన్నట్టే చేసింది.. దేశమంత కుటుంబం నాది. ఆస్తులున్నోళ్లంతా నా అన్నదమ్ముళ్లు. ఆభరణాలు వేసుకున్నోళ్లంతా నా అక్కాచెల్లెళ్లు. అవసరం కొద్దీ వాళ్ల జేబుల్లో చేతులు పెడితే ఫ్యామిలీ మెంబర్ అని కూడా చూడకుండా నా విూద కేసులు పెడుతున్నారు.. అంటూ గ్లింప్స్ వీడియోలో నితిన్ చెప్పే డైలాగ్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. ఈ మూవీలో నితిన్ దొంగగా సరికొత్త అవతారంలో కనిపించబోతుండగా వెన్నెల కిశోర్ కీ రోల్‌లో నటిస్తున్నారు. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యేర్నేని, రవి శంకర్ నిర్మి?స్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
ఇంకా చదవండి: 'డార్లింగ్' కోసం ప్రియదర్శి పాట్లు!
# Robinhood # Nithin # Sreeleela