రాజమౌళి..లెజెండ్‌ డైరెక్టర్‌:  ప్రముఖుల అభినందనలు

రాజమౌళి..లెజెండ్‌ డైరెక్టర్‌: ప్రముఖుల అభినందనలు

4 months ago | 42 Views

రాజమౌళి వ్యక్తిగత, సినీ కెరీర్‌పై ఇటీవల దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్‌ప్లిక్స్‌ 'మోడ్రన్‌ మాస్టర్స్‌’ టైటిల్‌తో ఓ డాక్యుమెంటరీ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. రాఘవ్‌ ఖన్నా దీనిని రూపొందించారు. ప్రస్తుతం నెట్‌ప్లిక్స్‌లో స్ట్రీమింగ్‌  అవుతోంది. ఇందులో రాజమౌళి వ్యక్తిగత జీవితాన్ని, సినిమాల రూపకల్పన వెనుక జరిగిన మేకింగ్‌ విషయాలను చూపించారు. రాజమౌళితోపాటు వారి ఫ్యామిలీ మెంబర్స్‌, హీరోలైన ప్రభాస్‌, ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌, రానాలతో జక్కన్నతో వర్క్‌ ఎక్స్‌ పీరియన్స్‌ను  చూపించారు.'మగధీర’ గురించి రామ్‌ చరణ్‌, తన స్టూడెంట్‌ నెం.1, సింహాద్రి గురించి ఎన్టీఆర్‌ ఆసక్తికరమైన సంగతులు చెప్పుకొచ్చారు. సినిమాల పరంగా రాజమౌళి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌.. దర్శకుడిగా అతని కెరీర్‌ ఎలా ప్రారంభమైందనేది మొదలు సినిమాలకు ఏ ఫిల్మ్‌ బై ఎస్‌. ఎస్‌. రాజమౌళి అనే ట్యాగ్‌లైన్‌ పెట్టే స్థాయి వరకు ఎలా ఎదిగారనే విషయాలను రాజమౌళి చెప్పుకొచ్చారు. అలానే రాజమౌళి తనను ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిన 'బాహుబలి’ సినిమా, అందులోని పాత్రల గురించి మాట్లాడారు.

ఈ సినిమా రిలీజ్‌ రోజుప్లాప్  టాక్‌ రావడం, కట్టప్ప క్యారెక్టర్‌ను తక్కువగా చూపించడం వంటి విషయాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అన్నింటిని మించి ’సింహాద్రి’ సినిమా చూసి చిరంజీవి రాజమౌళి దర్శకత్వ ప్రతిభకు థ్రిల్‌ అయ్యారని రామ్‌ చరణ్‌ చెప్పటం హాట్‌ టాపిక్‌ అయింది. అలాగే  రాజమౌళితో వర్క్‌ చూశాక ఆయన సినిమాలో చేసేందుకు ఎంత పెద్ద  హాలీవుడ్‌ నటుడైనా కాదనలేరని.. అంత గౌరవం రాజమౌళి పొందారని జేమ్స్‌ కెమోరూన్‌ కామెంట్స్‌ చేశారు. జో రుస్సో మాట్లాడుతూ ’ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాను చూసి సినీ ప్రపంచం విస్తుపొయిందని, దర్శకుడిగా రాజమౌళి పొటెన్షియల్‌ ప్రపంచవ్యాప్తంగా తెలిసిందన్నారు. హాలీవుడ్‌ నిర్మాతలు రాజమౌళితో సినిమాలు చేసేందుకు ముందుకొచ్చారాని, కానీ రాజమౌళి హాలీవుడ్‌కు వస్తారా? లేక ఇలానే తన వర్క్‌ను కంటిన్యూ చేస్తారా అనేది ఆయన ఇష్టమని రూసో అన్నారు.

ఇంకా చదవండి: మా రెమ్యూనరేషన్‌ కాదు..హీరోలను అడగండి

# Rajamouli     # Ramcharan     # Tollywood    

trending

View More