ఓటీటీ లో ఆసక్తి రేకెత్తిస్తున్న రాజమౌళి..మోడ్రన్‌ మాస్టర్స్‌... అతనో లెజెండ్‌ అంటూ చిత్ర ప్రముఖుల కామెంట్స్‌!

ఓటీటీ లో ఆసక్తి రేకెత్తిస్తున్న రాజమౌళి..మోడ్రన్‌ మాస్టర్స్‌... అతనో లెజెండ్‌ అంటూ చిత్ర ప్రముఖుల కామెంట్స్‌!

5 months ago | 78 Views

టాలీవుడ్‌ అగ్ర దర్శకుడు రాజమౌళిపై ఓటీటీ దిగ్గజం నెట్‌ప్లిక్స్‌ 'మోడ్రన్‌ మాస్టర్స్‌’ పేరుతో డాక్యుమెంటరీ రూపొందించింది. ఇందులో ఆయన సినీ ప్రయాణాన్ని చూపించనున్నారు. ఆగస్టు 2 నుంచి నెట్‌ప్లిక్స్‌ వేదికగా ఇది  స్ట్రీమింగ్‌ కానుంది. తాజాగా దీనికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేయగా అది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అందులో టాలీవుడ్‌, బాలీవుడ్‌, హాలీవుడ్‌ సినీ ప్రముఖులు రాజమౌళిపై వారి అభిప్రాయాలను పంచుకున్నారు. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, ప్రభాస్‌లతోపాటు హాలీవుడ్‌ దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌, బాలీవుడ్‌ దర్శకనిర్మాత కరణ్‌ జోహర్‌లు కూడా వారి అభిప్రాయాన్ని తెలియజేశారు. ఇలాంటి దర్శకుడిని నేను ఇప్పటివరకు చూడలేదు.

సినిమాలంటే ఆయనకు పిచ్చి ప్రేమ అని ప్రభాస్‌ తన అభిప్రాయం పంచుకున్నారు. ఆయన సినిమాల్లో నన్ను నేను చూసుకొని ఎంతో ఆశ్చర్యపోతానని నటుడు  రామ్‌చరణ్‌ ప్రకటించారు.  ఇప్పటివరకు ఎవరూ చూపించని కథలను ప్రపంచానికి చెప్పడం కోసమే రాజమౌళి జన్మించారని మరో నటుడు ఎన్టీఆర్‌ అన్నారు. ఈ ఇద్దరు కూడా   రాజమౌళి 'ట్రిపుల్‌ ఆర్‌'లో మంచి నటనను చాటారు. రాజమౌళికి సాధ్యం కానిది ఏదీ లేదు. ఎవరితోనైనా పని చేయగలరు. ఆయనంటే నాకెంతో గౌరవం అంటూ ఆంగ్ల చిత్రాల దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ వ్యాఖ్యానించారు. రాజమౌళితో పని చేసిన వారందరూ ఆయన్ని పని రాక్షసుడని పిలుస్తుంటారని ఆయన భార్య, ప్రముఖ క్యాస్టూమ్స డిజైనర్‌ రమా రాజమౌళి  అభిప్రాయపడ్డారు.  దర్శకుడు రాజమౌళి ఓ లెజెండ్‌  అని హిందీ దర్శక సమర్పకుడు కరణ్‌ జోహార్‌ అన్నారు.

ఇంకా చదవండి: సోషల్‌ విూడియా విమర్శలు...పట్టించుకోవాల్సిన పనిలేదన్న జాన్వీ!

# SSRajamouli     # MaheshBabu     # Tollywood    

trending

View More