'దేవర'ను వీక్షించిన రాజమౌళి!
2 months ago | 5 Views
'అరవింద సమేత' తరవాత దాదాపు ఆరేళ్లకు ఎన్టీఆర్ నటించిన 'దేవర' సోలో మూవీ కావడంతో ఆయన అభిమానులు ఫుల్ ఖుష్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో సినిమాహాళ్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. ఇదిలా ఉండగా, తాజాగా ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు రాజమౌళి వీక్షించారు. కుటుంబసభ్యులతో కలిసి బాలానగర్‌లోని మైత్రీ విమల్ థియేటర్‌కు వచ్చిన ఆయన.. అక్కడి సినీప్రియులకు అభివాదం చేశారు. అనంతరం వారితో కలిసి సినిమా చూశారు. దీనికి సంబంధించిన పలు వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. నిర్మాత దిల్‌రాజు, దర్శకుడు అనిల్ రావిపూడి శ్రీరాములు థియేటర్‌లో సినిమా చూశారు. మరోవైపు, చెన్నైలోని ఓ థియేటర్‌లో ఫ్యాన్స్‌తో కలిసి చిత్ర సంగీత దర్శకుడు అనిరుధ్ సినిమా చూశారు.
చిత్రంలోని ఫియర్ సాంగ్‌ను ఆలపించి.. ఫ్యాన్స్‌లో జోష్ నింపారు. ఎన్టీఆర్ ` కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం 'దేవర’ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా ఇది రూపుదిద్దుకుంది. దేవర, వర అనే పాత్రల్లో ఎన్టీఆర్ నటించారు. శ్రీదేవి కుమార్తె జాన్వీకపూర్ ఈ చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. సైఫ్ అలీఖాన్ కీలకపాత్ర పోషించారు. అనిరుధ్ స్వరాలు అందించారు. ఎన్టీఆర్ యాక్టింగ్‌కు సినీప్రియులు ఫిదా అవుతున్నారు. అనిరుధ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉన్నాయని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.
ఇంకా చదవండి: 'దేవర' చూస్తూ ...అభిమాని హఠాన్మరణం!