మహేశ్‌ బాబు గెటప్‌ను రాజమౌళి పట్టించుకోలేదా ?

మహేశ్‌ బాబు గెటప్‌ను రాజమౌళి పట్టించుకోలేదా ?

7 months ago | 5 Views

'ఆర్‌ఆర్‌ఆర్‌' తరువాత రాజమౌళి, హీరో మహేశ్‌ బాబు తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పట్నుంచో ఈ కాంబినేషన్‌లో సినిమా కోసం ఎదురుచూస్తున్నారు మహేష్‌ అభిమానులు. ఎట్టకేలకు వారి కోరిక త్వరలోనే తీరబోతుంది. ఈ ఇద్దరి కలయికలో రూపొందనున్న చిత్రం 2025, జనవరిలో సెట్స్‌ విూదకు వెళ్లనుంది. ప్రస్తుతం రాజమౌళి ఈ సినిమా స్క్రిప్ట్‌ వర్క్‌లో వున్నారు. మహేష్‌ కూడా రాజమౌళి చిత్రంలో కనిపించబోయే మేకోవర్‌ పనిలో వున్నాడు. ఈ చిత్రంలో ఈ సూపర్‌స్టార్‌ గుబురు గడ్డం, లాంగ్‌హెయిర్‌తో కనిపించబోతున్నాడు. ఇటీవల పలు వేడుకల్లో మహేష్‌ ఇదే లుక్‌లో విూడియాలో కనిపించిన సంగతి తెలిసిందే. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రిని కలిసిన మహేష్‌ను ఆలుక్‌లో చూసి ఆయన ఫ్యాన్స్‌ ఫిదా అయిపోయారు. రాజమౌళి సినిమాలో తమ హీరో లుక్‌ అదిరిపోయింది అంటూ సంబరాలు చేసుకున్నారు.

అయితే సాధారణంగా రాజమౌళి సినిమాల్లో హీరోలు మేకోవర్‌లో వున్నప్పుడు, అనుకోకుండా బయటి వెళ్లాల్సి వచ్చిన వాళ్ల మేకోవర్‌ను కనిపించడకుండా జాగ్రత్తపడేవారు. వీలున్నంత వరకు ఆ సినిమా ఫస్ట్‌లుక్‌ను రివీల్‌ చేసే వరకు పబ్లిక్‌ వేడుకల్లో కనబడకుండా వుండే వారు. ఇందుకు దర్శకుడు రాజమౌళి కూడా ఒప్పుకునేవారు కాదు.

ప్రభాస్‌, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లు రాజమౌళి సినిమా నిబంధనలు పాటించనవారే. అయితే మహేశ్‌ బాబుకు మాత్రం ఈ విషయంలో రాజమౌళి ఎలాంటి షరతులు విధించలేదని సమాచారం. మహేష్‌ ప్రస్తుతం రాజమౌళి సినిమా మేకోవర్‌లో వున్నా తరచుగా ఫంక్షన్‌ల్లో పాల్గొంటూ, పబ్లిక్‌లో కనిపిస్తూ లాంగ్‌హెయిర్‌, గుబురు గడ్డంతో ఫోటోలు కూడా ఇస్తున్నారు. అయితే హీరో మేకోవర్‌లో ఇది ప్రారంభం మాత్రమేనని, ఇంకా రాజమౌళికి కావాల్సిన మేకోవర్‌లో మహేష్‌ రావడానికి ఇంకాస్త సమయం పడుతుందని అంటున్నారు రాజమౌళి సన్నిహితులు.

ఇంకా చదవండి: అబుదాబి వేదికగా ఐఫా వేడుకల్లో నటి రేఖ ప్రత్యేక నృత్యప్రద్శన

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !

# Mahesh Babu     # Rajamouli