'కౌన్ బనేగా కరోడ్‌పతి'లో పవన్ కళ్యాణ్‌పై ప్రశ్న
3 months ago | 30 Views
హీరోగా ఇండస్ట్రీలో చెదరని ముద్ర వేసిన పవన్ రాజకీయాల్లోనూ చరిత్ర సృష్టించారు. తన పార్టీ నుంచి పోటీ చేసిన ప్రతి ఒక్కరూ అత్యధిక మెజారిటీతో విజయం సాధించడంతో.. 21 ఎమ్మెల్యేలు, రెండు ఎంపీ స్థానాలను సొంతం చేసుకున్నారు. దీంతో పవన్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. ఈ క్రమంలో ప్రఖ్యాత 'కౌన్ బనేగా కరోడ్‌పతి’ షోలో పవన్ కల్యాణ్‌కు సంబంధించిన ప్రశ్న అడగడం విశేషం. ప్రస్తుతం 'కౌన్ బనేగా కరోడ్‌పతి’ 16వ సీజన్ నడుస్తోంది. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ దీనికి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.
తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో బిగ్‌బీ ఓ కంటెస్టెంట్‌ను పవన్‌కు సంబంధించిన ప్రశ్న అడిగారు. '2024 జూన్‌లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నటుడు ఎవరు?’ అని అడిగారు. కంటెస్టెంట్ ఈ ప్రశ్నకు 'ఆడియన్స్ పోల్’ ఆప్షన్ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆడియన్స్‌లో 50 శాతం మందికి పైగా పవన్ కల్యాణ్ అని చెప్పారు. దీంతో వారు పవన్ పేరు చెప్పి లాక్ చేశారు. అది సరైన సమాధానం కావడంతో కంటెస్టెంట్ రూ.1.60లక్షలు గెలుచుకొని తర్వాత ప్రశ్నకు వెళ్లారు.
ఇంకా చదవండి: ముద్దు సీన్లలో నటించడం అంత తేలిక కాదు: మాళవికా మోహనన్
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !
# KaunBanegaCrorepati # PawanKalyan # AmitabhBachchan