హైదరాబాద్ నడిబొడ్డున 'పుష్ప' వైల్డ్ ఫైర్ జాతర!
1 day ago | 5 Views
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా డిసెంబర్ 5వ తేదీన భారీ అంచనాలతో పుష్ప 2 ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. నేషనల్ క్రష్ రష్మిక మందన్నతో జంటగా నటిస్తూ సుకుమార్ దర్శకత్వంలో దేవిశ్రీ ప్రసాద్ సంగీత అందిస్తున్న చిత్రం ఇది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఎలమంచిలి నిర్మాతలుగా సునీల్, ఫహాడ్ ఫాసిల్, జగపతి బాబు, రావు రమేష్, అనసూయ భరద్వాజ్, ధనుంజయ తదితరులు కీలకపాత్ర పోషిస్తూ పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో ఈ చిత్రం రానుంది. ఇప్పటికే ఈ చిత్ర టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి. అలాగే ఈ చిత్రం నుండి విడుదలైన నాలుగు పాటలు కూడా ఎంతో వేగంగా ప్రేక్షకుల మన్నన పొందాయి. ఇప్పటికే పాట్నా, చెన్నై, కొచ్చి, ముంబై నగరాలలో జరిగిన ఈ చిత్ర ఈవెంట్లకు ప్రేక్షకుల నుండి అపారమైన రెస్పాన్స్ రావడం జరిగింది. కాగా ఇప్పుడు హైదరాబాదులో ఈ చిత్ర ఈవెంట్ జరుగుతుండగా ఎన్నడూ లేని విధంగా సుమారు 1000 మంది పోలీసులు ఈవెంట్ కు బలగంగా నిలవడం జరిగింది.
ఈ సందర్భంగా పుష్ప వైల్డ్ ఫైర్ జాతరలో కొరియోగ్రాఫర్ విజయ్ పోలకి మాట్లాడుతూ... "అందరికి నమస్కారం. నేను ఈ చిత్రంలో రెండు పాటలకు ఒక స్టెప్స్ తో కొరియోగ్రఫీ చేయడం జరిగింది. సినిమా ఎంతో అద్భుతంగా రావడం జరిగింది. సుకుమార్ గారు సినిమాకు సంబంధించి ప్రతి విషయంలోనూ ఎంతో పర్టికులర్గా ఉన్నారు. బన్నీ గారు ఈ చిత్రం కోసం చాలా కష్టపడ్డారు. సుమారు సంవత్సరం పాటు వీరితో ట్రావెల్ చేయడం జరిగింది. వారి డెడికేషన్ కు నేను ఫిదా అయిపోయాను. డిసెంబర్ 5వ తేదీన థియేటర్లో కలుద్దాం" అన్నారు.
ప్రొడక్షన్ డిజైనర్స్ రామకృష్ణ, మౌనిక మాట్లాడుతూ... "ఈ చిత్రంలో పనిచేసిన అందరికీ ఈ 5 ఏళ్లు జీవితంలో మంచి జర్నీగా గుర్తుండిపోతుంది. చిత్రంలో పనిచేసిన నటీనటులు, టెక్నీషియన్స్ అందరికీ మా ధన్యవాదాలు" అన్నారు.
సినిమాటోగ్రాఫర్ మిరోస్లో కుబా బ్రోజెక్ మాట్లాడుతూ... "ఈ చిత్రంలో ఇంతటి స్టార్స్ తో పని చేయడం నాకు ఇంత సంతోషంగా ఉంది. ఇక్కడ నేను మరిన్ని గొప్ప విజువల్స్ తీసేందుకు వీలుగా ఉంది. ఈ చిత్రంలో పనిచేసేందుకు నాకు అవకాశం ఇచ్చిన దర్శకుడు సుకుమార్ కు నా ధన్యవాదాలు. అలాగే చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కు ప్రత్యేక ధన్యవాదాలు. కేవలం అల్లు అర్జున్, సుకుమార్ లాంటి వాడు మాత్రమే ఎటువంటి అద్భుతమైన చిత్రాలను తీయగలరు అనిపిస్తుంది" అన్నారు.
దర్శకుడు వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ... "మీ అందరి ముందు ఇలా మాట్లాడటం అదృష్టంగా భావిస్తున్నాను. నేను అల్లు అర్జున్ గారితో కలిసి ఒక యాడ్లో పని చేయడం జరిగింది. ఒక చిన్న యాడ్ కి ఆయన ఇచ్చిన డెడికేషన్ కి నేను ఆశ్చర్యపోయాను. అలాంటిది పుష్ప లాంటి ఇంత పెద్ద ప్రాజెక్టుకు ఆయన ఎంత కష్టపడి ఉంటారో నా ఊహలు కూడా అందడం లేదు. ఈ సినిమా గురించి అల్లు అర్జున్ మాటల్లో విన్నప్పుడే ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది అని అర్థం అయింది. ఇక మైత్రి మూవీ మేకర్స్ అంటే నా కుటుంబం లాంటివారు. నిర్మాతలు రవి గారికి, నవీన్ గారికి, చెర్రీ గారికి ముందుగానే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను" అన్నారు.
దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ... "ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారం. ఈ చిత్రం కోసం కష్టపడిన దర్శకుడు సుకుమార్ గారికి, అల్లు అర్జున్ గారికి అలాగే చిత్ర బృందం అందరికీ ధన్యవాదాలు. మూడు సంవత్సరాలుగా మీరు ఈ చిత్రం కోసం పడుతున్న కష్టాన్ని చూస్తూ ఉన్నాం. పుష్ప ది రూల్ సినిమా ఒక అల్లు అర్జున్ గారి సినిమాగా కాకుండా తెలుగు సినిమాగా ప్రపంచవ్యాప్తంగా రూల్ చేయబోతుంది. తప్పకుండా డిసెంబర్ 5న అందరూ థియేటర్లో చూడండి" అన్నారు.
దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి మాట్లాడుతూ... "అందరికి నమస్కారం. పుష్ప 1 సమయంలో బన్నీతో నార్త్ ఇండియాని వదలకు. అక్కడ నీకోసం ఎంతోమంది అభిమానులు ఉన్నారు అని. ఇప్పుడు మూడు సంవత్సరాల తర్వాత పుష్ప 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి ప్రమోషన్స్ అవసరం లేనంతగా క్రేజ్ ఉంది. సాధారణంగా ఏ సినిమా ఈవెంట్కైనా వెళ్ళినప్పుడు ఆ సినిమాకు ఉపయోగపడేలా ఏదైనా మాట్లాడుతాము, కానీ ఈ సినిమాకు అటువంటి అవసరం లేదు. కాబట్టి సరదాగా మీతో ఒక విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. సుమారు రెండు మూడు నెలల క్రితం రామోజీ ఫిలిం సిటీలో పుష్ప షూటింగ్ జరుగుతుండగా అక్కడికి వెళ్లాను. అక్కడ బన్నీ, సుకుమార్ గారితో మాట్లాడుతూ ఉండగా సుకుమార్ నాకు సినిమాలో ఒక సీన్ చూపించడం జరిగింది. ఆ సీన్ పుష్ప రాజ్ ఇంట్రడక్షన్ సీన్. అది చూస్తేనే నాకు అర్థం అయిపోయింది సినిమా ఎలా ఉండబోతుంది అనేది. వెంటనే దేవి శ్రీ ప్రసాద్ నుండి ఎంత మ్యూజిక్ చేయించుకోగలరు అంత చేయించుకోండి అని అన్నాను. ఇక డిసెంబర్ 4 సాయంత్రం నుండి ఈ సినిమా ఎలా ఉండిపోతుందనేది ప్రపంచం అందరికీ తెలిసిపోతుంది. మనందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వర్షం కూడా పడుతుంది, ఇది కచ్చితంగా ఒక శుభమే" అన్నారు.
దర్శకుడు మలినేని గోపీచంద్ మాట్లాడుతూ... "పుష్ప అనేది దేశవ్యాప్తంగా ఒక బ్రాండ్ అయిపోయింది. రాజమౌళి గారు చెప్పినట్లు పుష్ప అనేది ఒక పండుగ అయిపోయింది. నేను మూడు సంవత్సరాల క్రితం వేరే దేశానికి వెళ్ళినప్పుడు టాలీవుడ్ అని చెప్పగానే బాహుబలి అనేవారు, కానీ ఇప్పుడు పుష్ప అంటున్నారు. ఎక్కడికి వెళ్లినా ఇదే వినిపిస్తుంది. దీని బట్టే అర్థం చేసుకోవచ్చు పుష్ప, అలాగే అల్లు అర్జున్ గారు ఒక బ్రాండ్ అయిపోయారు. నేను అల్లు అర్జున్ గారిని ఎంతో దగ్గరగా చూసాను. ఈరోజు ఆలోచన గారు ఈ స్థాయిలో ఉండాలంటే కారణం ఆయన పట్టుదల మాత్రమే. రాజమౌళి గారు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. సుకుమార్ ఒక మాస్ కమర్షియల్ తీస్తే భారీగా ఉంటుందని. అదే ఈరోజు పుష్ప. మైత్రి మూవీ మేకర్స్ కి ఈ సినిమా మంచి విజయం కావాలని కోరుకుంటున్నాను. పుష్ప ప్రపంచం అంతటా వైల్డ్ ఫైర్ గా హిట్ కొడుతుంది" అంటూ ముగించారు.
దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతూ... "అందరికీ నమస్కారం. సాధారణంగా సినిమాకు సంబంధించి ఒక ఈవెంట్ చేశామంటే అది ఆ సినిమా గురించి ప్రజలందరికీ తెలియాలి అని. కానీ పబ్లిసిటీ అవసరం లేని బ్రాండ్ పుష్ప. ఈ చిత్రం పెద్ద హిట్టు కావాలని చిత్ర బృందం అందరికీ నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను" అన్నారు.
అల్లు అర్జున్ కుమారుడు అల్లు అయాన్ మాట్లాడుతూ... "నమస్కారం, అందరూ ఎలా ఉన్నారు? మీకు అందరికీ పుష్ప చాలా బాగుంటాది ఇంకా తగ్గేదెలే" అన్నాను.
అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ అందరికీ నమస్కారం తెలియజేశారు. అటు పిమ్మట ఓ తెలుగు పద్యాన్ని గుక్క తిప్పకుండా స్టేజి మీద చెప్పడం జరిగింది. అది చూసిన వారంతా ఆశ్చర్యపోయారు.
నటి అనసూయ భరద్వాజ్ మాట్లాడుతూ... "అందరికీ నమస్కారం. పుష్ప విషయానికి వస్తే ఎక్కడ తగ్గేదేలే అనే విధంగా ఉంది. పుష్పలో ఈ క్యారెక్టర్ నేను అడిగి తీసుకున్నాను. దానికి అల్లు అర్జున్ గారికి, సుకుమార్ గారికి నా కృతజ్ఞతలు. ఈ సినిమా కోసం నేను డిసెంబర్ 5వ కోసం ఎంతగానో వేచి చూస్తున్నాను. సుకుమార్ గారి చిత్రాలు అంటే కచ్చితంగా మన అంచనాలకు మించి ఉంటాయి. నాకు సినిమాలో అల్లు అర్జున్ గారితో తక్కువ సీన్లు ఉన్నా కూడా ఎక్కువగా సునీల్ గారితో, ఫాహద్ ఫాసిల్ గారితో ఎక్కువగా ఉన్నాయి. వారి దగ్గరను నేను చాలా నేర్చుకున్నాను. ఇన్ని సంవత్సరాలు రష్మిక ఈ సినిమా కోసం ఎంత కష్ట పడిందో చూశాను. ఖచ్చితంగా దీనికి తగ్గ ఫలితం నీకు దక్కుతుంది. డిసెంబర్ 5వ తేదీన థియేటర్లో కలుద్దాం" అన్నారు.
నిర్మాత అల్లు అరవింద్ గారు మాట్లాడుతూ... "అందరికి నమస్కారం. నేను ఒక వారం రోజుల క్రితం సినిమా చూడటం జరిగింది. చూసి ఇంటికి వెళ్ళిన తర్వాత నా భార్య ఎందుకు మొహం ఇంత వెలిగిపోతుంది అని అడిగారు. మగధీర ముందు మీ మొహం ఎంత వెలిగిపోవడం చూశాను. మళ్లీ ఇప్పుడు చూస్తున్నాను అని ఆమె అన్నారు. అల్లు అర్జున్ భార్య స్నేహ, సుకుమార్ భార్య భబితకు నా వార్డులు అన్నీ ఇచ్చేయాలి. ఎందుకంటే 5 సంవత్సరాల పాటు ఇంతగా సపోర్ట్ చేసినందుకు. అలాగే ఈ సినిమాలో నేను తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేసిన హీరోయిన్ రష్మిక గురించి మాట్లాడాలి. ఎంత బాగా నటించింది అంటే పుష్ప 1 సినిమాలో ఆమె నటన ఈ సినిమాతో పోలిస్తే చాలా తక్కువ అని చెప్పుకోవాలి. ఈ సినిమాలో అంత బాగా చేసింది. ఇక శ్రీలీల ఉండేది తక్కువ సమయమైనా చాలా బాగా ఇంపాక్ట్ చూపిస్తుంది. అలాగే దేవిశ్రీ ప్రసాద్ నాకు తన చిన్నతనం నుండి తెలుసు. తన తండ్రి నా స్నేహితుడు. తను ఇంత మంచి హిట్స్ కొట్టడం ఆశ్చర్యంగా ఉంది. ఒక నిర్మాతగా నేను చెప్తున్నాను మైత్రి మూవీ మేకర్స్ దేశంలోనే అతిపెద్ద నిర్మాతలు. వారు ఇన్ని సినిమాలు ఇంత పర్ఫెక్ట్ గా ఎక్కడ ఒక కంప్లైంట్ కూడా లేకుండా ఎలా చేస్తారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. అందరికీ ఆల్ ద బెస్ట్" అంటూ ముగించారు.
సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ... "అందరికి నమస్కారం. ఈరోజు పుష్ప ఈ స్థాయిలో ఉండటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో పనిచేసినందుకు ఎంతో గర్వంగా ఉంది. ముందుగా పుష్ప 1 నుండి పుష్ప 2 వరకు పనిచేసిన నా టీంకు ధన్యవాదాలు తెలపాలి అనుకుంటున్నాను. అలాగే మమ్మల్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకుని వెళ్లిన దర్శకుడు సుకుమార్ కు నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. అలాగే ఈ సినిమాలో ఇంత మంచి పాటలు అందించిన చంద్రబోస్ గారికి నా ధన్యవాదాలు. అలాగే మిగతా భాషలలో ఆ పాటలు అంత బాగా వచ్చేలా రాసిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. సినిమాలో నటించిన రష్మిక మందన్న అలాగే కిసిక్ సాంగులో పర్ఫామ్ చేసిన శ్రీలీలకు నా ధన్యవాదాలు. అందరికీ ఈ సాంగ్స్ నచ్చినట్లు తెలుస్తుంది. అలాగే నా చిన్ననాటి స్నేహితుడు అల్లు అర్జున్ గురించి చెప్పాలి అంటే తన గురించి ఎవరు ఎప్పుడు ఏం మాట్లాడుతున్నావ్ కూడా నేను వెంటనే అల్లు అరవింద్ గారి వైపు చూస్తాను. ఎందుకంటే మనకంటే ఎక్కువగా మన తండ్రులు గర్వంగా ఫీల్ అవుతారు. నాకింత ఆదరణ చూపిస్తున్న అందరికీ నా ధన్యవాదాలు. చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్" అన్నారు.
నటి శ్రీలీల మాట్లాడుతూ... "నాకు ఈ రోజు ఇక్కడ నిలబడి మాట్లాడటం ఎంత సంతోషకరంగా ఉంది. పుష్ప సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు చిత్ర బృందానికి నా ధన్యవాదాలు. దర్శకుడు సుకుమార్ గారికి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. సాధారణంగా ఒక సినిమాలు ఇద్దరు హీరోలు పనిచేస్తుంటే అందరూ వారిద్దరూ అతలాకుతలం అయిపోతుంది అనుకుంటారు. కానీ నా ఇతన్ని చూసి మిగతా వారంతా సెట్స్ లో అలా అయిపోవరు. మా ఇద్దరి మధ్య అంత మంచి బాండింగ్ ఉండటం సంతోషకరం. అలాగే దేవిశ్రీ ప్రసాద్ గారికి, చంద్రబోస్ గారికి, మైత్రి మూవీ మేకర్స్ కి, ప్రేక్షకులందరికీ నా ధన్యవాదాలు" అన్నారు.
నేషనల్ క్రష్ రష్మిక మందన్న మాట్లాడుతూ... "అందరూ బాగున్నారా? మేము దేశం వ్యాప్తంగా ఈ సినిమా ప్రమోట్ చేయడానికి తిరిగాము. కానీ నేను ఎక్కడ ఎక్కువగా మాట్లాడలేదు. ఈరోజు కొంచెం టైం తీసుకుని అయినా మాట్లాడుతాను. పుష్ప 1 చేస్తున్నప్పుడే పుష్ప 2లో ఇంతకంటే బాగా చేయాలని సుకుమార్ గారి దర్శకత్వంలో అల్లు అర్జున్ గారితో నటిస్తూ నా పూర్తి పెర్ఫార్మన్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు నేను ఇలా నటిస్తున్నాడు అంటే అది కేవలం సుకుమార్ గారు, అల్లుఅర్జున్ గారు వల్లే. సుకుమార్ గారు సాధారణంగా చాలా సైలెంట్ గా ఉంటారు. పుష్ప 1 చేసేటప్పుడు ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అనుకున్నాను. కానీ పుష్ప 2 సమయంలో చాలా సౌకర్యంగా ఫీల్ అవుతూ మాట్లాడుకునేవాళ్లం. సుకుమార్ గారి దర్శకత్వంలో ఇంకొక సినిమాకు అవకాశం వస్తుందని ఆశిస్తున్నాను. సుకుమార్ గారు అంటే నాకు అంత ఇష్టం. ఈ సినిమాతో అయినా ఎంత కష్టపడుతున్నారు అనేది అందరికీ కనిపిస్తుంది. ఈ సినిమాతో మీరు ఈ రాష్ట్ర దేశ సరిహద్దులు దాటి అంతర్జాతీయ స్థాయిలో నిలిచిపోవాలని కోరుకుంటున్నాను. అలాగే మైత్రి మూవీ మేకర్స్ తో పనిచేయడం నాకు ఎంత సంతోషంగా ఉంది. మరిన్ని సినిమాలు మీతో కలిసి చేయడానికి నేను మీకు చూస్తాను. ఈ సినిమా మంచి హిట్ అయ్యి మీకు డబ్బులు తీసుకురావాలని కోరుకుంటున్నాను. అలాగే డిఓపి గారు సినిమాలో ప్రతి ఫ్రేమ్ ని ఒక పెయింటింగ్ ల చూపించారు. అలాగే ఈ చిత్రం కోసం 5 సంవత్సరాలపాటు ఇంతగా కష్టపడిన చిత్ర బృందానికి నా ధన్యవాదాలు. దేవిశ్రీ ప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. శ్రీలీల చేసిన డాన్స్ తో నా హార్ట్ కిస్సిక్ అయిపోయింది. చివరిగా అల్లు అర్జున్ గారి గురించి చెప్పాలంటే మీతో కలిసి నటించడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. మీరు సరిహద్దులు దాటి వెళ్లేలా చేశారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా వైల్డ్ ఫైర్ కావలి అని ప్రార్థిస్తున్నాను. అలాగే అభిమానులకు ప్రేక్షకులకు ఎప్పుడు రుణపడి ఉంటాను" అన్నారు.
చిత్ర నిర్మాత మైత్రి నవీన్ గారు మాట్లాడుతూ... "అందరికీ నమస్కారం. నాకు చాలా సంతోషంగా ఉంది. చివరగా డిసెంబర్ 4వ తేదీ సాయంత్రం నుండి సినిమా థియేటర్లో రాబోతుంది. అందరూ ఈ సినిమాని ఆదరించి పెద్ద హిట్టు చేస్తారని కోరుకుంటున్నాను" అన్నారు.
చిత్ర నిర్మాత మైత్రి రవి గారు మాట్లాడుతూ... "మూడు సంవత్సరాలు కష్టపడి ఎప్పుడు మీ ముందుకు రాబోతున్నాం. ప్రేక్షకుల ఆశీర్వాదాలు ఉంటాయి అని ఆశిస్తున్నాం. అలాగే ఇతనికి పనిచేసిన చిత్ర బృందం అందరికీ మా ధన్యవాదాలు. అదేవిధంగా చిత్రం నటించిన అల్లు అర్జున్, రష్మిక, శ్రీలీల తదితరులు అందరికీ ధన్యవాదాలు. పుష్ప 1కు జాతీయ వార్డు వచ్చింది. పార్ట్ 2 కూడా మరో నేషనల్ అవార్డు వచ్చే రేంజ్ లో ఈ సినిమాలో పెర్ఫార్మెన్స్ ఉండబోతుంది. అలాగే సుకుమార్ గారికి జీవితంలోనే ఇది ఒక పెద్ద సినిమాగా నిలిచిపోతుందని, ఆయన కష్టానికి తగ్గట్లు ఒక విజయం సాధిస్తుందని కోరుకుంటున్నాను. ఎవరైతే ఒక సీన్ అద్భుతంగా వచ్చింది అని అనుకుంటారు వారు కూడా షాక్ అయ్యే విధంగా సినిమాను తీయడమే సుకుమార్ గారి గొప్పతనం. అలాగే చిత్రం కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతూ మాకు డిస్ట్రిబ్యూషన్లో తోడ్పడిన వివిధ రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్లు అందరికీ పేరుపేరునా మా ప్రత్యేక ధన్యవాదాలు. ప్రపంచ వ్యాప్తంగా 12,500 స్క్రీన్స్ లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాము" అంటూ ముగించారు.
మైత్రి మూవీ మేకర్స్ సీఈవో చెర్రీ గారు మాట్లాడుతూ... "అందరికి నమస్కారం. ఇంత పెద్ద సినిమాను చేసే అవకాశం వచ్చినందుకు అదృష్టంగా భావిస్తున్నాను. ప్రపంచ వ్యాప్తంగా ఆరు భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. కచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. ఈ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు" అన్నారు.
చిత్ర దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ... "నేను బన్నీని ఆర్య నుండి చూస్తున్నాను. తను ఎలా ఎదుగుతున్నాడు చూస్తూనే వచ్చాను. తనని వ్యక్తిగా, ఒక ఆర్టిస్టుగా చూసాను. ఈ పుష్ప అనే సినిమా ఇలా వచ్చింది అంటే దానికి కారణం కేవలం నాకు బండికి ఉన్న ఒక బాండింగ్ కారణంగానే. బన్నీ ఒక సీన్ కోసమో లేదా ఒక సాంగ్ కోసమో కాదు, ఒక ఎక్స్ప్రెషన్ కోసం కూడా ఎంతో కష్టపడతాడు. అది ఎంత చిన్నదైనా సరే చాలా శ్రద్ధతో చేస్తాడు. కేవలం నీ మీద ప్రేమతోనే ఈ సినిమా నేను తీశాను. నీతో ఈ సినిమా గురించి మాట్లాడినప్పుడు నా దగ్గర పూర్తి కథ లేదు. నువ్వు నన్ను నమ్మి నాతో ప్రయాణం చేసినందుకు నీకోసం నేను ఏమైనా చేసేయొచ్చు అనిపించింది. మిగతావారు అంతా చెప్పినట్లు బన్నీ సెట్స్ లో అందర్నీ కలిపి ఒక స్థాయిలోకి తీసుకుని వెళ్లి కూర్చోబెడతాడు. దానితో అందరికీ అదే స్థాయిలో పనిచేయాలని అనిపిస్తుంది. అలాగే నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. మీరు మేము మంచి ఆట ఆడటానికి సరైన గ్రౌండ్ ఇచ్చారు. పుష్ప ను రెండు భాగాలుగా చేయడానికి ముఖ్య కారణం చెర్రీ గారు. అలాగే చిత్రం కోసం సెట్స్ లో కష్టపడి పనిచేసిన రష్మిక, డిఓపి అందరికీ ధన్యవాదములు. రష్మిక గురించి ప్రత్యేకంగా మాట్లాడాలి. తను ప్రతి ఎక్స్ప్రెషన్ ఇంకా ఎమోషన్ను చాలా బాగా క్యారీ చేసింది. అలాగే దేవిశ్రీ ప్రసాద్ కి ధన్యవాదాలు. క్లైమాక్స్ లో ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో సినిమా ఎంతో హై ఉండబోతుంది. శ్రీలీల డాన్స్ మూవ్స్ చాలా బాగా చేసింది. ఈ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరూ చాలా బాగా కష్టపడ్డారు" అంటూ ముగించారు.
ఐకాన్ స్టార్ట్ అల్లు అర్జున్ మాట్లాడుతూ... "అందరికీ నమస్కారం. పుష్ప1 పూర్తయ్యేప్పటికీ పుష్పా 2 కథను వినలేదు. కానీ పూర్తిగా నమ్మకం ఉంది పుష్ప 2 అస్సలు తగ్గేదేలే అని. ఇక్కడికి వచ్చేసాను ప్రతి ఒక్కరికి నా థాంక్స్. మూడు సంవత్సరాల క్రితం ఇదేవిధంగా పుష్ప 1 సినిమాకు ఫంక్షన్ చేశాం. మూడేళ్ల తర్వాత ఇప్పుడు ఇలా కలుస్తున్నాం. నా ఆర్మీగా నేర్పించుకునే నా ఫాన్స్ అందరికీ లవ్ యు. ముందుగా మా నిర్మాతలు మైత్రి నవీన్ గారికి, మైత్రి రవి గారికి ధన్యవాదములు. వీళ్ళు కాకుండా ఇంకా ఏ నిర్మాతలు అయినా ఈ సినిమా తీయగలిగే వారు కాదు. మమ్మల్ని నమ్మి ఈ సినిమాపై కోట్లు ఖర్చు పెట్టినందుకు వారికి థాంక్స్. అలాగే మైత్రి మూవీ మేకర్స్ సీఈఓ చెర్రీ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సినిమా రెండు పార్ట్స్ కలిపి ఐదు సంవత్సరాలు జీవితాన్ని ఇచ్చిన అందరి గురించి మాట్లాడాలి. ఈ చిత్రం కోసం పనిచేసిన టెక్నీషియన్స్ లో ముందుగా డిఓపి కూబా గారికి, ఆర్ట్ డైరెక్టర్స్ కి, కొరియోగ్రాఫర్స్ కి పేరుపేరునా ధన్యవాదాలు. అలాగే సినిమా కోసం పని చేసిన ఫైట్ కొరియోగ్రాఫర్స్, చంద్రబోసు గారికి, ఇతర భాషలలో లిరిక్స్ రాసిన అందరికీ థాంక్స్. అలాగే నా స్నేహితుడు దేవిశ్రీ ప్రసాద్ గురించి నేను ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎందుకంటే మా జర్నీ 20 ఏళ్ల నుండి ఉంది. నీకు చాలా థాంక్స్. అలాగే ఈ సినిమాలో పనిచేసిన ఆర్టిస్టుల గురించి చెప్పాలి. ముందుగా ఫహద్ ఫజల్ గారు ఎంతో అద్భుతంగా నటించారు. సినిమాలో ఫస్ట్ హాఫ్ పూర్తయిన తర్వాత ఆయన నటన గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు. కేరళ వారు అంతా ఆయనను చూసి గర్వపడే విధంగా నటించారు. అలాగే ఈ సినిమాలో నటించిన రావు రమేష్ గారు, సునీల్ గారు, అనసూయ గారు తదితరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ పర్ఫార్మ్ చేసిన శ్రీలీల ఈ జనరేషన్ లో తెలుగు వారందరూ ఆదర్శంగా తీసుకునే విధంగా ఉంటుంది. తెలుగు వారంతో గర్వించే స్థాయికి మమ్మల్ని తీసుకుని వెళ్లాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఐదు సంవత్సరాల నుండి నాతో కలిసి పనిచేసిన రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాలి. తను కాకుండా ఇంకా వేరే వారైతే ఈ ఐదు సంవత్సరాలు ఎలా గడిచేదో కూడా నాకు తెలియదు. రెండు రోజులపాటు కనీసం నిద్ర కూడా లేకుండా ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండా పీలింగ్స్ సాంగ్ కోసం పనిచేస్తుంది. తన కళ్ళను చూసి ఆశ్చర్యపోయిన నేను నిద్రపోయావా అని అడిగితే తను లేదు అంది. అది చూసి నాకు ఎంతో బాధ వేసింది. తను అంత ప్రొఫెషనల్ గా ఈ సినిమా కోసం పనిచేస్తుంది. ఈ సినిమా నీకు చాలా గొప్ప పేరు తీసుకుని కోరుకుంటున్నాను. ఇలాంటి అమ్మాయిలతో కలిసి పని చేయాలి అనిపించేలా పని చేశావు. సుకుమార్ గురించి చెప్పాలి అంటే పుష్ప అనేది సుకుమార్ సినిమా. ఈయనను చూసి ఇంత గొప్ప డైరెక్టర్ తెలుగులో ఉన్నాడా అనుకునేలా పనిచేస్తారు. సినిమాను ప్రమోట్ చేయడం కోసం మేము దేశమంతా తిరుగుతుంటే ఆయన మాత్రం సినిమా ఇంకా బాగా వచ్చేలా చేయడానికి కష్టపడుతూనే ఉన్నారు. ఈ సినిమా కోసం అందరూ కష్టపడ్డారు అనడం కంటే తమ జీవితాలను పెట్టేసారు అనడం కరెక్ట్. సుకుమార్ గారు లేకుండా ఇది జరిగేదే కాదు. ఆయన లేకుండా మేము లేము. జీవితంలో అందరూ తమ ఐదు సంవత్సరాల కాలాన్ని ఆయనను నమ్మి పెట్టాము. ఆయన నాతో కలిసి ఆర్య సినిమా చేయకపోతే నేను లేను. ఈ సినిమా నాకోసం ఆడాలని నేను ఎప్పుడు అనుకోలేదు. కానీ మూడుసార్లు మాత్రం ఈ సినిమా ఆడాలనుకున్నాను. సుకుమార్ గారి కష్టం చూసి అనుకున్నాను. ఈ సినిమా కోసం మూడు సంవత్సరాలు కష్టపడిన చిత్ర బృందం కోసం సినిమా ఆడాలి అనుకున్నాను. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలు వచ్చినప్పుడు తెలుగువారు ఎంతో గర్వించారు. ఆ తర్వాత పుష్ప సినిమాతో అంతే స్థాయిలో ఉండటంతో తెలుగువారి కోసం ఈ సినిమా ఆడాలి అనుకున్నాను. ఈ సినిమా కోసం మా బెస్ట్ ఇచ్చేసాము. నేను ఇప్పుడు ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువ అనిపిస్తుంది. డిసెంబర్ 5వ తేదీన మీకు సినిమా చూశాక ఆ విషయం అర్థమవుతుంది. సుకుమార్ గారు మాట్లాడేటప్పుడు నేను చాలా ఎమోషనల్ అయిపోయాను. దేశవ్యాప్తంగా అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను చూడబోతున్న ప్రేక్షకులందరికీ చెప్తున్నాను, సినిమా తీసింది మేము అయినా తీసింది మీకోసం. ఇది మా గొప్పతనం కాదు, మీ ఆదరణ. ప్రపంచవ్యాప్తంగా సుమారు 12 వేలకు పైగా స్క్రీన్ లలో 80 పైగా దేశాలలో ఈ సినిమా విడుదల కాబోతుంది. ఆరు భాషలలో ఓ పండగ వాతావరణం ఉండబోతుంది. దీనికి ఎంతో గర్విస్తున్నాను. అలాగే ఈ ఈవెంట్ కు సంపూర్ణ మద్దతు తెలిపిన తెలంగాణ పోలీసులకు నా ప్రత్యేక ధన్యవాదాలు. చివరిగా మరొకసారి నా అభిమానులకు థాంక్స్. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా, ఫైర్ అనుకుంటివా, వైల్డ్ ఫైర్" అంటూ ఈ ఈవెంట్ ముగించారు.
ఇంకా చదవండి: నేనేం ఐటమ్ గర్ల్‌ను కాదు.. : తమన్నా