హాలీవుడ్‌లోనూ రచ్చ చేస్తున్న 'పుష్పా 2'

హాలీవుడ్‌లోనూ రచ్చ చేస్తున్న 'పుష్పా 2'

2 months ago | 5 Views

‘పుష్ప అంటే నేషనల్‌ అనుకుంటివా.. ఇంటర్నేషనల్‌’ అనే డైలాగ్‌ని సుకుమార్‌ ఏ ఉద్దేశంతో రాశాడో కాని అది అక్షరాల నిజమైంది. ఇప్పటి వరకు కేవలం నేషనల్‌ వైడ్‌గానే ‘పుష్ప రాజ్‌’ ర్యాంపేజ్‌ చూసిన సినీ లోకం, తాజాగా ఇంటర్నేషనల్‌ వైడ్‌గా పుష్ప విశ్వరూపాన్ని విట్‌నెస్‌ చేస్తోంది. 3 గంటల 40 నిమిషాల నిడివితో నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన ఈ సినిమాకి విదేశీయలు పట్టం కడుతున్నారు. సోషల్‌ మీడియాలో రివ్యూలు షేర్‌ చేస్తూ రచ్చ చేస్తున్నారు. ప్రస్తుతం నెట్‌ ఫ్లిక్స్‌ లో ‘పుష్ప 2’ సినిమా ఇండియాతో పాటు మరో ఏడు దేశాల్లో నంబర్‌ వన్‌ స్థానంలో ట్రెండ్‌ అవుతోంది.

Pushpa 2 Record: పుష్ప 2 సినిమా రికార్డుల హోరు కంటిన్యూ.. మరొకటి-allu arjun pushpa  2 the rule creates single screen theatre collections record in telugu  states ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్

వరల్డ్‌ వైడ్‌ గా 5.8 మిలియన్ల వ్యూస్‌తో అత్యధిక వ్యూస్‌ సంపాదించుకున్న రెండవ ఆంగ్లేతర సినిమాగా సరికొత్త చరిత్ర సృష్టించింది. కాగా ట్రేడ్‌ పండితుల లెక్క ప్రకారం ఈ సినిమా వ్యూస్‌ మరింతా పెరిగే అవకాశమున్నట్లు తెలుపుతున్నారు. సినిమా టికెట్‌లు ఈ సినిమాలోని యాక్షన్‌ సన్నివేశాలను చూసి షాక్‌ అవుతున్న ఫారిన్‌ ఆడియెన్స్‌ ఈ సినిమా క్లిప్స్‌ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ.. ఎగ్జైట్‌మెంట్‌ ప్రదర్శిస్తున్నారు. అలాగే కొన్ని మాస్‌ రివ్యూస్‌ని కూడా పోస్ట్‌ చేశారు.

ఇంకా చదవండి: కొంపముంచుతున్న ఏఐ.. మాధవన్‌కు అనుష్క ఫోన్‌!

Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# పుష్పా2     # సుకుమార్‌     # అల్లుఅర్జున్     # రష్మికమందన్న    

trending

View More