'పుష్ప-2' టికెట్ ఇస్తామంటున్న బ్లింక్‌ఇట్.. గ్రోసరీస్ కొంటే ఓచర్ ఉచితమని ప్రకటన
1 month ago | 5 Views
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ బ్లింక్ ఇట్ తమ వినియోగదారులకు బంఫర్ ఆఫర్ ప్రకటించింది. తమ యాప్‌లో గ్రాసరీలు ఆర్డర్ చేసుకున్నవారికి అల్లు అర్జున్ నటిస్తున్న 'పుష్ప 2' టికెట్ ఫ్రీగా ఇవ్వబోతున్నట్లు ప్రకటించింది. పాన్ ఇండియా మోస్ట్ అవైటెడ్ చిత్రం 'పుష్ప -2' డిసెంబర్ 5 ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. మరో 12 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 'పుష్ప -2' సందడి మొదలు కానుండటంతో ఇప్పటి నుంచే టికెట్ల కోసం ఎగబడుతున్నారు అభిమానులు. ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే మొదలుకాగా.. ఇండియాలో ఎప్పుడు బుకింగ్స్ స్టార్ట్ అవుతాయా అని మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే దేశవ్యాప్తంగా 'పుష్ప 2' సినిమాకి ఉన్న క్రేజ్‌ని వాడుకోవాలి అనుకున్న ప్రముఖ ఈ కామర్స్ సంస్థ బ్లింక్ ఇట్ తమ వినియోగదారులకు బంఫర్ ఆఫర్ ప్రకటించింది. తమ యాప్‌లో కిరాణా సమాన్లు కొనుకున్నవారికి 'పుష్ప 2' టికెట్ వోచర్ ఇవ్వబోతున్నట్లు ప్రకటించింది. అయితే రూ.999 కంటే ఎక్కువ ఆర్డర్ చేస్తేనే ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. ఈ ఆఫర్ నవంబర్ 23 నుంచి నవంబర్ 29 వరకు ఉంటుందని ప్రకటించింది.
ఇంకా చదవండి: మోహన్ బాబు 50ఏళ్ల సినీ ప్రయాణం!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !
# పుష్ప2 # అల్లుఅర్జున్ # శ్రీలీల