పూరీ పవర్ ఫలాసఫీ!
16 days ago | 5 Views
టాలీవుడ్ అగ్ర దర్శకుడు పూరీ జగన్నాథ్ మరో కొత్త పాడ్ కాస్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పూరీ సినిమాలను తెరకెక్కించడమే కాకుండా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఫిలాసఫీ పేరిటా పాడ్ కాస్ట్‌లు చేస్తాడన్న విషయం తెలిసిందే. పూరి మ్యూజింగ్స్ అనే ? పేరుతో పూరీ తన భావాలను వివిధ అంశాలపై మాట్లాడుతుంటాడు. ఈ విషయాలను యూట్యూబ్ వేదికగా అప్లోడ్ చేస్తూ ఉంటాడు. దీనికి ప్రేక్షకుల నుంచి కూడా మంచి ఆదరణ ఉంది. ఈ వారం పవర్ ఫిలాసఫీ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పవర్ అంటే ఏంటి.. నాకు అది కావాలి ఇది కావాలి అని కోరుకోవడం పవర్ కాదు. అవి నాకు వద్దు అనుకోవడం పవర్. జీవితంలో కొన్ని కొన్ని వదులుకునే సత్తా ఉండటం పవర్. చెయ్యి చాచటం పవర్ కాదు దానం చేయటం పవర్. అంత చలిలో నీ ఒంటి మీద ఉన్న శాలువ తీసి పక్కవాడికి కప్పడం పవర్. దాచుకోవడం పవర్ కాదు. పదిమందికి పంచడం పవర్. చాలా విషయాల్లో చాలా మందికి నో చెప్పగలగాలి. కానీ అలా చెప్పకపోవడం పవర్.
జీవితంలో ఒంటరిగా ఉండగలగటం పవర్. నాకు పిల్లలు వద్దు అనుకోవడం పవర్. ఒంటరిగా నీతో నువ్వు కూర్చోగలగడం.. నీ నిర్ణయాలు నువ్వు తీసుకోగలగడం. ఎవరి మీద ఆధారపడకుండా బతకడం పవర్. సమస్యలు వస్తే వాటికి దూరంగా పోవడం పవర్ అవ్వదు. వాటిని ధైర్యంగా ఎదుర్కోవడం పవర్. సింపుల్‌గా బతకటం ఎవ్వరిని నొప్పించకుండా ఉండటం. ఇవన్ని పవర్‌ఫుల్ లక్షణాలు. ఒక రాజ్యాన్ని సృష్టించడానికి మీకు పవర్ కావాలి. అదే రాజ్యాన్ని వదులుకోవడానికి కూడా ఇంకా పవర్ కావాలి. ఈ విషయంలో మంచి ఉదాహరణ గౌతమ బుద్ధుడు. ఈ మధ్యకాలంలో బుద్ధుడి కంటే ఎక్కువ త్యాగం చేసిన వ్యక్తి ఒకడు ఉన్నాడు. అతని పేరు సిరిపాన్ని.
అతను మలేషియన్ బిలియనర్. తన వద్ద ఉన్న 50 వేల కోట్ల ఆస్తిని వదులుకొని బౌద్ధ సన్యాసిగా మారాడు. అతను ఇప్పుడు థాయిలాండ్, మయన్మార్ బోర్డర్‌లో ఒక ఫారెస్ట్ లో ఉన్న బౌద్ధ మఠంలో సన్యాసి జీవితం గడుపుతున్నాడు. అంత డబ్బు మనం జీవితంలో సంపాదించలేము. చేతుల్లో ఉన్న అంత సంపదని సునాయాసంగా ధారాదత్తం చేయడం పవర్. ఇలా ఎన్నో పనులు మనం చేయలేకపోయినా కనీసం మీ పెదాల మీద ఎప్పుడూ ఒక చిరునవ్వు ఉంటే.. మీరు అందరికంటే పవర్‌ఫుల్ అంటూ పూరీ చెప్పుకొచ్చాడు.
ఇంకా చదవండి: ఆ అమ్మాయిలా పోరాడండి: నాగచైతన్య వివాహంపై సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్