లండన్‌లో ప్రియాంక దీపావళి వేడుకలు!
1 month ago | 5 Views
బాలీవుడ్ నటి, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా దీపావళి పండుగను ఘనంగా జరుపుకున్నారు. తన భర్త నిక్ జొనాస్‌తో కలిసి ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌తో వేడుకలను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా హాలీవుడ్ స్టార్స్, ఫ్రెండ్స్‌కు ప్రత్యేకంగా పార్టీ ఇచ్చారు. లండన్‌లోని జింఖానా రెస్టారెంట్‌లో వీరు తమ ఫ్రెండ్స్‌కు ఈ పార్టీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా పీసీ సంప్రదాయ చీర కట్టులో మెరిశారు.
సబ్యసాచి డిజైన్ చేసిన రెడ్ శారీలో ఎంతో అందంగా కనిపించారు. భర్త నిక్ సైతం సంప్రదాయ కుర్తా ధరించి ఆకట్టుకున్నారు. పార్టీ సందర్భంగా తమ ఫ్రెండ్స్‌కు వీరు ఇండియన్ స్వీట్స్‌ను గిఫ్ట్‌గా అందించినట్లు తెలుస్తోంది. పీసీ దీపావళి పార్టీకి సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి.
ఇంకా చదవండి: ఇది ఊహకందని కథ.. సింహంతో రాజమౌళి!!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !
# దీపావళి # ప్రియాంకచోప్రా # నిక్‌జొనాస్ # లండన్