'ది ఫ్యామిలీ మాన్' మూడో సీజన్ ఓటీటీ లో అలరించటానికి వచ్చేస్తుంది
5 months ago | 102 Views
రాజ్, డీకే దర్శకత్వంలో వచ్చిన వెబ్ సిరీస్ 'ది ఫ్యామిలీ మాన్’ చాలా పెద్ద విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇంతకు ముందు ఈ వెబ్ సిరీస్ రెండు సీజన్ లు వచ్చింది, ఇప్పుడు మూడో సీజన్ కి సమాయత్తం అవుతోంది. ఇందులో మనోజ్ బాజ్ పాయ్, ప్రియమణి జంటగా నటించిన విషయం కూడా తెలిసిందే. మనోజ్ బాజ్ పాయ్ ఇందులో ఒక స్పై గా కనపడతారు, అతను చేసిన శ్రీకాంత్ తివారి పాత్ర ప్రతి ఇంట్లో సుపరిచితం అయిపొయింది అంటే, ఆ పాత్రలో మనోజ్ అంతగా మమేకం అయిపోయారు. ఈ వెబ్ సిరీస్ రెండో సీజన్ లో సమంత రూత్ ప్రభు ఒక విలన్ పాత్రలో అదరగొట్టింది అనే చెప్పాలి. అలాగే ఇప్పుడు ఈ మూడో సీజన్ లో ఆమె ఉందొ లేదో తెలియదు కానీ, చిత్రీకరణ మాత్రం లండన్ లో చేస్తున్నారని భోగట్టా. ఎందుకంటే తెలుగు నటులు సందీప్ కిషన్, మురళి శర్మలు ఇద్దరూ ఈ మూడో సీజన్ లో కనిపిస్తారని అంటున్నారు.
సందీప్ కిషన్ మొదటి సీజన్ లోనే కనిపించాడు, మళ్ళీ ఈ మూడో సీజన్ లో అతని పాత్ర ఎక్కువ ఉంటుందని అంటున్నారు.ఆగస్టు 15 నుండి సందీప్ కిషన్, మురళి శర్మ లు లండన్ ఈ ’ఫ్యామిలీ మాన్’ చిత్రీకరణకు వెళుతున్నట్టుగా భోగట్టా. సందీప్ కిషన్ ఇప్పుడు తెలుగు సినిమా ’మజాకా’ చిత్రీకరణతో బిజీగా వున్నాడు. అయితే ఇప్పుడు ఆ సినిమాకి కొంతకాలం గ్యాప్ ఇచ్చి, ఈ ’ఫ్యామిలీ మాన్’ చిత్రీకరణకు లండన్ వెళుతున్నట్టుగా తెలిసింది. అతనితో పాటు మురళి శర్మ కూడా చిత్రీకరణలో పాల్గొంటున్నట్టుగా తెలిసిందే. రాజ్, డీకేలు సందీప్ కిషన్ కి స్నేహితులు అనే విషయం అందరికీ తెలిసిన విషయమే. సందీప్ కిషన్ నటించిన తమిళ సినిమా ’రాయన్’ ఈ నెల 26న విడుదల అవుతోంది. ధనుష్ కథానాయకుడిగా, దర్శకుడిగా చేస్తున్న ఈ సినిమాలో సందీప్ కిషన్ ఒక ముఖ్య పాత్రలో కనపడనున్నాడు. ఇది తమిళం, తెలుగులో ఒకేసారి విడుదలవుతోంది.
ఇంకా చదవండి: సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కోడి రామకృష్ణ.. జయంతి సందర్భంగా పలువురు నివాళి!
# Thefamilyman # Sandeepkishan # Muralisharma