
పవన్ కళ్యాణ్‌కు ప్రకాశ్ రాజ్ కౌంటర్!?
4 days ago | 5 Views
ఇటీవల జరిగిన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఆవిర్భావ సభలో పలు విషయాల గురించి మాట్లాడారు. ఈ క్రమం లోనే తమిళనాట హిందీని తమపై రుద్దుతున్నారని హడావిడి చేస్తున్న కొందరి గురించి కామెంట్స్ చేశారు. అంటే పరోక్షంగా తమిళనాడు అంశాన్ని ప్రస్తావించారు. అన్ని దేశ భాషలే కదా. తమిళనాడులో హిందీ వద్దని అనడం ఎంత వరకు కరెక్ట్. మరి తమిళ సినిమాలను హిందీలోకి అనువదించకండి.. హిందీవాళ్ల డబ్బులు కావాలి.. కానీ హిందీ భాష వద్దంటే ఎలా? మనం భాషలను ద్వేషించాల్సిన అవసరం లేదు. దేశానికి తమిళం సహా బహుళ భాషలు కావాలి.. బహుభాషలే దేశానికి మంచిది అంటూ పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు. అంతేకాదు తమిళనాడులో సంస్కృతాన్ని తిడుతున్నారు.
దక్షిణాదిపై హిందీని రుద్దుతున్నారంటూ మాట్లాడుతున్నారు. ఏ రాష్ట్రంలో అయిన ముస్లింలు అరబిక్‌లోనే ప్రార్థిస్తారు. కానీ ఎన్నడూ ఆ భాష తమకొద్దని అనలేదు. హిందువులు మాత్రం దేవాలయాలలో సంస్కృత మంత్రాలు చదవొద్దిని చెబుతుంటారు. ముస్లింలని చూసి హిందువులు చాలా నేర్చుకోవాలి. రూపాయి సింబల్ మార్చేసి తమిళ భాషలో పెట్టుకోవటం ఏంటి? వివేకం, ఆలోచన ఉండొద్దా అన్నారు పవన్ కళ్యాణ్. ఉత్తరాది వాళ్లు తెల్లగా ఉంటారు. మేం దక్షిణాది వాళ్లం నల్లగా ఉంటామనే మాటలతో దేశాన్ని విచ్ఛిన్నం చేయకండి.
దక్షిణాదికి చెందిన సెంగోల్.. ఉత్తరాదిన ఉన్న పార్లమెంట్‌లో ఉంది. దీని అర్థం వైరుధ్యమొస్తే విడిపోవాలని కాదు. కలిసి పరిష్కారం వెతుక్కోవాలని. విధ్వంసం చాలా తేలిక. నిర్మించటమే కష్టం అని పవన్ అన్నారు. అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకి ప్రకాశ్ రాజ్ తనదైన శైలిలో స్పందించారు. మీ హిందీ భాషను మా మీద రుద్దకండి’, అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు, ‘ స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం’, అని పవన్ కళ్యాణ్ గారికి ‘ఎవరైనా చెప్పండి ప్లీజ్’ అంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. ప్రకాష్ రాజ్ గతంలో కూడా పవన్ కళ్యాణ్‌కి కౌంటర్స్ ఇచ్చిన విషయం తెలిసిందే. తిరుమల లడ్డూ వ్యవహారం, సనాతన ధర్మం విషయంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు ప్రకాశ్ రాజ్ పంచ్ లు ఇచ్చాడు. ఇక తాజాగా హిందీ భాష అంశంపై చేసిన వ్యాఖ్యలకు కూడా జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇచ్చారు.
ఇంకా చదవండి: రేసింగ్ ట్రాక్‌పై శోభిత-నాగచైతన్య సందడి!
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!