వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్!

వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్!

1 month ago | 5 Views

దేశంలోనే అత్యంత డిమాండ్‌ ఉన్న సూపర్‌స్టార్లలో ఒకరిగా అవతరించారు ప్రభాస్‌. ‘బాహుబలి’ ఫ్రాంచైజీ నుంచి నిన్నమొన్నటి ‘కల్కి 2898ఏడీ’ వరకూ ఆయన నటించిన ప్రతి సినిమా, వందలకోట్ల వసూళ్లను రాబడుతూ ప్రభాస్‌ స్టామినాను తెలియజేస్తూనే ఉంది. దేశవ్యాప్తంగా విమర్శలను ఎదుర్కొన్న ‘ఆదిపురుష్‌’ సైతం దాదాపు 450 కోట్ల వసూళ్లను రాబట్టిందంటే ప్రభాస్‌ స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఆయన ‘బాహుబలి 2’ 1800కోట్ల వసూళ్లతో దేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇప్పటికీ ఆ రికార్డును అందుకునే సినిమా రాలేదు. ప్రస్తుతం ఆయన జెట్‌ వేగంతో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. మారుతి దర్శకత్వంలో ‘రాజాసాబ్‌’, హను రాఘపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’, మరోవైపు సందీప్‌రెడ్డి వంగా ‘స్పిరిట్‌’, ఇంకోవైపు ప్రశాంత్‌నీల్‌ ‘సలార్‌ 2’.

ఇక నాగ్‌ అశ్విన్‌ ‘కల్కి 2’ ఇలాగూ ఉంది. వీటిలో కొన్ని షూటింగ్‌ దశలో ఉంటే.. కొన్ని ప్రీప్రొడక్షన్‌ దశలో ఉన్నాయి. ఇదిలావుంటే.. ఈ వేగాన్ని మరింత ఉధృతం చేసే దిశగా ప్రభాస్‌ అడుగులేస్తున్నారు. కన్నడ సినీరంగంలో పేరెన్నికగన్న ప్రతిష్టాత్మక చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌. ఇప్పటికే వారు నిర్మిస్తున్న ‘సలార్‌ 2’లో నటిస్తున్నారు ప్రభాస్‌. ఈ సినిమా తర్వాత ‘హోంబలే’ నుంచి వచ్చే మరో రెండు సినిమాల్లో ఆయన నటించేందుకు ఒప్పందం కుదిరింది.

Hombale Films to collaborate with Prabhas in a three-film partnership - The  Hindu

ఆ సినిమాలేంటి? దర్శకులెవరు? తదితర అంశాలపై త్వరలోనే క్లారిటీ రానుంది. అయిదు సినిమాలు ప్రస్తుతం నిర్మాణంలో ఉండగా, మరో రెండు సినిమాలకు ప్రభాస్‌ సైన్‌ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

ఇంకా చదవండి: సల్మాన్‌ఖాన్‌కు మరోసారి స్ట్రాంగ్‌ వార్నింగ్‌!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !

# ప్రభాస్‌     # కల్కి2898ఏడీ     # సలార్‌2     # హోంబలే    

trending

View More