మోస్ట్‌ పాపులర్‌ హీరోల జాబితాలో మరోసారి టాప్‌లో  ప్రభాస్‌!

మోస్ట్‌ పాపులర్‌ హీరోల జాబితాలో మరోసారి టాప్‌లో ప్రభాస్‌!

4 months ago | 33 Views

 ప్రస్తుతం ప్రభాస్‌ పేరు సోషల్‌ విూడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ స్టార్‌ హీరో మరో ఘనత దక్కించుకున్నారు. ప్రముఖ విూడియా సంస్థ ఆర్మాక్స్‌ విడుదల చేసిన మోస్ట్‌ పాపులర్‌ హీరోల జాబితాలో మరోసారి టాప్‌లో నిలిచారు. తాజాగా ఆర్మాక్స్‌ జులై నెలకు సంబంధించి దేశవ్యాప్తంగా మోస్ట్‌ పాపులర్‌ స్టార్‌ల జాబితాను విడుదల చేసింది. ఇందులో ప్రభాస్‌ అగ్రస్థానంలో నిలిచారు. మే, జూన్‌ నెలల్లో టాప్‌ వన్‌లో ఉన్న ప్రభాస్‌.. జులైలోనూ అదే స్థానంలో ఉన్నారు.

కల్కి విడుదల నేపథ్యంలో గత రెండు నెలలుగా ప్రభాస్‌ పేరు ట్రెండింగ్ లో  ఉంది. తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చిన సందర్భంగా పలు వీడియోలు ఎక్స్‌లో సందడిగా మారాయి. ఈ నేపథ్యంలో మూడోసారి కూడా ప్రభాస్‌ టాప్‌ వన్‌లోనే ఉన్నారు. ఆర్మాక్స్‌ జులై జాబితాలో విజయ్‌ రెండులో, షారుక్‌ ఖాన్‌ మూడో స్థానంలో ఉన్నారు. ప్రభాస్‌ -నాగ్‌ అశ్విన్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'కల్కి’ తాజాగా ఓటీటీ ప్రేక్షకుల ముందుకువచ్చింది. అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ప్రసారమవుతోంది.

ఇంకా చదవండి: ప్రభాస్‌పై అర్షద్‌ వార్సీ వ్యాఖ్యలు.. చర్యలు తీసుకోవాలంటూ మంచు విష్ణు లేఖ

# Prabhas     # HanuRaghavapudi    

trending

View More