వరుస విజయాలతో అగ్రభాగాన ప్రభాస్‌!

వరుస విజయాలతో అగ్రభాగాన ప్రభాస్‌!

1 month ago | 5 Views

ప్రస్తుతం దేశమంతా సగర్వంగా పేరు చెప్పుకుంటున్న నటుడు మన రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌. వరుసగా విజయవంతమైన చిత్రాలను చేస్తూ రోజురోజుకు తన స్థాయిని మరింతగా పెంచుకుంటూ పోతున్నాడు. అక్టోబర్‌ 23న ప్రభాస్‌ జన్మదినం సందర్భంగాప్రపంచ వ్యాప్తంగా ఆయన అభిమానులు అంబరాన్నంటేలా బర్త్‌డే సెలబ్రేషన్స్‌ నిర్వహిస్తున్నారు. అదేవిధంగా సేవాగుణం, మానవత్వంలోనూ తనకు మరొకరు సాటి రాని విధంగా పేరు దక్కించుకుంటూ  ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. 'బాహుబలి' విజయంతో కెరీర్‌లో ఉన్నత స్థాయికి చేరుకున్న ప్రభాస్‌ దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటుడిగా ఎదిగాడు.


హీరోగా అంతకముందు నుంచి ఉన్నప్పటికీ, ప్రభాస్‌ను స్టార్‌ చేసి ప్రపంచ స్థాయిలో నిలబెట్టింది 'బాహుబలి' చిత్రం. అవడానికి టాలీవుడ్‌ నటుడు అయినా బాలీవుడ్‌ ఖాన్‌ లను మించిన క్రేజ్‌ ఇప్పుడతని సొంతం. గత పదేళ్ల కాలంలో ప్రభాస్‌ నేమ్‌ ఫేమ్‌ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతూ వస్తొంది. పాన్‌ ఇండియా వైడ్‌ నటుడిగా ఎంతో క్రేజ్‌ సంపాదించుకోవడంతో పాటు వ్యకిగతంగా ఆస్తుల విలువ కూడా బాగా పెరిగింది.   ఖరీదైన ఇళ్లు మరియు కార్ల వరకు, ప్రభాస్‌ నెట్‌ వర్త్‌ ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ టాలీవుడ్‌గా మారడమే గాక ఫోర్బ్స్‌ ఇండియా సెలబ్రిటీల జాబితాలో ప్రభాస్‌ ప్లేస్‌ సంపాదించుకోవడం విశేషం.

ఇంకా చదవండి: రామ్ చరణ్‌కి అరుదైన గౌరవం.. మేడమ్ టుస్సాడ్స్‌లో క్వీన్ ఎలిజబెత్ II తర్వాత గ్లోబల్ స్టార్


HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !
# ప్రభాస్‌     # టాలీవుడ్    

trending

View More