రాజేంద్రప్రసాద్‌కు ప్రభాస్‌ పరామర్శ!

రాజేంద్రప్రసాద్‌కు ప్రభాస్‌ పరామర్శ!

1 month ago | 5 Views

సీనియర్‌ నటుడు రాజేంద్ర ప్రసాద్‌ ఇంట్లో విషాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. గుండెపోటుతో ఆయన కుమార్తె గాయత్రి గత శనివారం మృతి చెందింది. అయితే రాజేంద్ర ప్రసాద్‌ కుమార్తె గాయత్రి మరణవార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ఆమెకు నివాళులు అర్పించడంతో పాటు రాజేందప్రసాద్‌ను పరామర్శించిన విషయం తెలిసిందే. ఇప్పటికే మెగాస్టార్‌ చిరంజీవితో పాటు, ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, వెంకటేశ్‌ తదితరులు ఆయనను పరామర్శించి ధైర్యం చెప్పారు.


అయితే కూతురు పోయిన బాధలో ఉన్న నటకిరిటిని తాజాగా నటుడు రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ పరామర్శించాడు. ఆయనకు ధైర్యం చెప్పారు. అనంతరం రాజేందప్రసాద్‌ కూతురు గాయత్రికి నివాళులు అర్పించాడు. రాజేంద్ర ప్రసాద్‌ కుమార్తె 38 ఏండ్ల గాయత్రికి గత రాత్రి గుండెపోటు రాగా.. కుటుంబ సభ్యులు హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖానలో చేర్చారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆమె చనిపోయారు. కాగా, రాజేంద్ర ప్రసాద్‌కు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. అలానే గాయత్రి కుమార్తె సాయి తేజస్విని బాలనటిగా మహానటి చిత్రంలో నటించారు.

ఇంకా చదవండి: త్వరలోనే బాహుబలి పెళ్లి...!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !
# Prabhas     # RajendraPrasad     # Tollywood