కాంచన సీరిస్‌లో పూజా హెగ్డే పేరు పరిశీలన!
3 months ago | 38 Views
దర్శక నటుడు, నిర్మాత రాఘవ లారెన్స్ కథానాయకుడిగా వచ్చిన 'కాంచన’ సిరీస్‌లో భాగంగా త్వరలో నాలుగో భాగం తెరకెక్కనుంది. ఇందులో హీరోయిన్‌గా బుట్టబొమ్మ పూజా హెగ్డేను తీసుకునేందుకు సంప్రదింపులు జరుపుతున్నారు. ఒకవైపు ఇతర దర్శకులతో కలిసి పనిచేస్తున్న రాఘవ లారెన్స్.. మరోవైపు 'కాంచన`4’ స్క్రిప్టును కూడా సిద్ధం చేసుకున్నారు. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో ఉన్నత సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కించాలని ఆయన నిర్ణయించారు. దీనికి అనుగుణంగానే ఈ స్టోరీ విన్న తర్వాత గోల్డ్‌మైన్స్ నిర్మాణ సంస్థ ముందుకు వచ్చింది.
దీంతో ఈ సంస్థతో కలిసి రాఘవ లారెన్స్ కాంచన నాలుగో భాగాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారు. గత మూడు చిత్రాల తరహాలోనే నాలుగో భాగాన్ని కూడా ప్రేక్షకులను అలరించేలా కథను సిద్ధం చేశారు. ఈక్రమంలో ముందుగా మృణాల్ ఠాకూర్, మాళవిక మోహనన్ పేర్లు వినిపించినప్పటికీ తాజాగా హీరోయిన్‌గా పూజా హెగ్డేను తీసుకునేందుకు సంప్రదింపులు జరుపుతున్నట్టు కోలీవుడ్ వర్గాల సమాచారం. కాగా, గోల్డ్‌మైన్స్ నిర్మాణ సంస్థ అనేక తమిళ హిట్ చిత్రాలను హిందీలోకి అనువాదం చేసి విడుదల చేసింది. లారెన్స్ ప్రస్తుతం నటిస్తోన్న హంటర్ చిత్రాన్ని కూడా ఈ సంస్థే నిర్మిస్తుండడం గమనార్హం.
ఇంకా చదవండి: అమెరికాలో బాలయ్య ఫిల్మ్ జర్నీ వేడుకలు!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !
# PoojaHegde # RaghavaLawrence # Kanchana