ప్లీజ్.. నన్ను అలా పిలవకండి : కమల్
1 month ago | 5 Views
భారతీయ సినిమా చరిత్ర ఉన్నంత కాలం గర్వించదగ్గ కళాకారుడు 'కమల్ హాసన్'. సినిమా అనేది సాహిత్యం అయితే ఆయనను చరిత్ర స్టార్‌గానో, హీరోగానో కాదు గొప్ప కళాకారుడిగా గుర్తించుకుంటుంది. కేవలం వర్సటైల్ యాక్టింగ్‌తోనే కాకుండా సినీ రంగంలో అనేక ప్రయోగాలతో రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా ఆయన స్థానం ఎవరెస్ట్. ఇటీవల కమల్ హాసన్ 70 ఏళ్ళలోకి అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో ఆయన తన జీవితంలో ఒక ఆసక్తికర నిర్ణయం తీసుకున్నారు.
ఆ నిర్ణయాన్ని పాటించాలని తన అభిమానులని, ఆరాధకులని, మీడియాని అందరిని ఉద్దేశించి ఒక బహిరంగ విన్నపం చేశారు. ఆ విన్నపం ఏంటంటే.. కమల్ అభిమానులు ఆయనని ప్రేమగా ‘‘ఉలగనాయగన్’’ అని పిలుస్తారు. దాని అర్థం యూనివర్సల్ స్టార్. తెలుగులోనూ ‘విశ్వనాయకుడు’, ‘లోకనాయకుడు’ టైటిల్స్‌తో ఆయనని సంబోధిస్తారు. అయితే అలా పిలవడం కమల్‌కి ఇష్టం లేదని తెలిపారు. ప్లీజ్.. నన్ను అలా పిలవకండి అని అన్నాడు.
ఇంకా చదవండి: ఆలియా భట్ ప్రధాన పాత్రగా లేడీ ఓరియెంటెడ్ పాన్ ఇండియా స్క్రిప్ట్ తో రానున్న నాగ్ అశ్విన్
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !
# కమల్‌హాసన్ # ఉలగనాయగన్