పెద్ద సినిమాకు పైరసీ కష్టాలు

పెద్ద సినిమాకు పైరసీ కష్టాలు

5 hours ago | 5 Views

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నటించిన పుష్ప2 సినిమా బాక్సాఫీస్‌ రికార్డులను తిరగరాస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రూ.1500 కోట్ల వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం రూ.2000 కోట్ల దిశగా దూసుకువెళుతుంది. అయితే ఈ క్రమంలోనే చిత్రయూనిట్‌కి భారీ షాక్‌ తగిలింది. ఈ సినిమా  ప్రింట్‌ ఆన్‌లైన్‌లో లీక్‌ అయ్యింది. సైబర్‌ నేరగాళ్లు పుష్ప 2 ది రూల్‌ మొత్తం సినిమా ప్రింట్‌ రూపంలో ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. దీంతో మూవీ ఈ విధంగా లీక్‌ కావడం వల్ల కలెక్షన్లపై దారుణంగా దెబ్బ పడే ఛాన్స్‌ ఉంది. మరోవైపు చిత్రయూనిట్‌ కూడా ఈ విషయంను సీరియస్‌గా తీసుకోవడమే కాకుండా.. సైబర్‌ వింగ్‌ను కలిసినట్లు తెలుస్తుంది. దీనిపై కంప్లయింట్‌ ఇవ్వడంతో పాటు సినిమాను ఆన్‌లైన్‌ నుంచి తొలగించేందుకు చర్యలు చేపడుతుంది.

ఇంకా చదవండి: నేను సోలోగా వచ్చి నాలుగేళ్లు అవుతోంది.. : రామ్‌చరణ్‌

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# పుష్ప 2     # అల్లు అర్జున్    

trending

View More