ఎన్టీఆర్‌ 'దేవర' ప్రత్యేక షోలకు అనుమతి!

ఎన్టీఆర్‌ 'దేవర' ప్రత్యేక షోలకు అనుమతి!

1 day ago | 30 Views

ఎన్టీఆర్‌ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ 'దేవర’. జాన్వీకపూర్‌ కథానాయిక. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకురానున్న ఈ మూవీ 'దేవర: పార్ట్‌`1’ సెప్టెంబరు 27న  విడుదలకు సిద్ధమైంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ఎన్టీఆర్‌ అభిమానులకు శుభవార్త చెప్పబోతోంది.'దేవర’ స్పెషల్‌ షోలకు అనుమతి ఇచ్చినట్లు సమాచారం.

అగ్ర కథానాయకుల సినిమాల విడుదల సమయంలో ప్రీమియర్‌ షోలను ప్రదర్శిస్తుంటారు. అంతేకాదు, మొదటివారం టికెట్‌ ధరలపెంపునకు ప్రభుత్వం అనుమతి ఇస్తుంది.'దేవర’ చిత్ర బృందం తెలంగాణ ప్రభుత్వాన్ని కలిసి స్పెషల్‌ షోలు, టికెట్‌ధరల పెంపునకు అనుమతివ్వాలని కోరగా, అందుకు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ప్రభుత్వం జీవోను  విడుదల చేయనున్నారు. తొలిరోజు అర్ధరాత్రి 1గంట షోకు అనుమతివ్వడంతో పాటు, రోజూ ఆరు ఆటలను 14 రోజుల పాటు ప్రదర్శించేందుకు కూడా ఓకే చెప్పారట. సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్స్‌లో రూ.50, మల్టీప్లెక్స్‌ల్లో రూ.100 పెంపునకు అనుమతి కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇంకా చదవండి: అభిమానులతో కలసి ANR క్లాసిక్ 'ప్రేమ్ నగర్' మూవీ చూసిన హీరో నాగచైతన్య

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !

# Devara     # JrNTR     # Janhvikapoor     # September27    

trending

View More