'దేవర' స్పెషల్ షోలకు అనుమతి: ఎపి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన ఎన్టీఆర్
2 months ago | 40 Views
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'దేవర’ జాన్వీకపూర్ కథానాయిక కాగా సైఫ్ అలీఖాన్ కీలక పాత్ర పోషించారు. ఈ నెల 27న ఇది ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ అభిమానులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రత్యేక షోలకు అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించింది.టికెట్ ధరలు, స్పెషల్ షోల విషయంపై ఇటీవల'దేవర’ టీమ్ ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సంప్రదించింది. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ తాజాగా జీవో విడుదల చేసింది.
ఈమేరకు తొలిరోజు అర్ధరాత్రి 12 గంటల షోతో పాటు ఆరు ఆటలకు అనుమతిచ్చింది. 28వ తేదీ నుంచి ఐదు ఆటలకు పర్మిషన్ ఇచ్చింది. అలాగే టికెట్ ధరలను సైతం పెంచుకోవడానికి వెసులుబాటు కల్పించింది. సింగిల్ స్క్రీన్స్‌లో జీఎస్టీతో కలిసి అప్పర్ క్లాస్ రూ.110, లోవర్ క్లాస్ రూ.60, మల్టీప్లెక్స్ థియేటర్స్‌లో రూ.135 వరకూ పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. మరోవైపు తెలంగాణలోనూ స్పెషల్ షోలకు ప్రభుత్వం ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. తొలిరోజు అర్ధరాత్రి 1 గంట షోకు అనుమతివ్వడంతో పాటు, రోజూ ఆరు ఆటలను 14 రోజుల పాటు ప్రదర్శించేందుకు అంగీకరించారట. సింగిల్ స్క్రీన్ థియేటర్స్‌లో రూ.50, మల్టీప్లెక్స్‌ల్లో రూ.100 పెంచుకునే వెసులుబాటు కల్పించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. స్పెషల్ షోలకు అనుమతించడంతో సీఎం చంద్రబాబునాయుడు.. ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌కి నటుడు ఎన్టీఆర్ ధన్యవాదాలు తెలిపారు. తెలుగు సినిమాకు సహకారం అందిస్తున్న విూకు కృతజ్ఞతలు. సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కందుల దుర్గేశ్‌గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా‘ అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.
ఇంకా చదవండి: రొమాంటిక్ కామెడీతో 'రాజసాబ్': చిత్ర విశేషాలు పంచుకున్న మాళవిక
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!