
అందం, అభినయంతో అదరగొడుతున్న పాయల్‌రాజ్‌పుత్
13 days ago | 5 Views
'ఆర్ ఎక్స్ 100' సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న చిన్నది పాయల్ రాజ్‌పుత్. ఈ ముద్దుగుమ్మ తన అందచందాలతో ఎప్పుడూ నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతుంటుంది. తాజాగా ఈ బ్యూటీ షార్ట్ డ్రెస్ లో తన గ్లామర్ తో కుర్రకారుకు చెమటలు పట్టిస్తుంది. డెమిన్ క్లాత్ తో తయారు చేసిన ఈ డ్రెస్ లో అమ్మడు చాలా అందంగా ఉంది. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. అందాల ముద్దుగుమ్మ పాయల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. చేసిన సినిమాలు తక్కువే అయినా ఈ బ్యూటీ యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. 'ఆర్ ఎక్స్ 100' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే మంచి ఫేమ్ సంపాదించుకుంది. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో పాయల్ తన గ్లామర్ తో కుర్రకారుకు నిద్రలేకుండా చేసింది.
పాయల్ రాజ్ పుత్ మొదటి సినిమా మంచి గుర్తింపు తెచ్చినప్పటికీ అంతగా అవకాశాలు రాలేదు. 'ఆర్ ఎక్స్ 100' సినిమా తర్వాత పాయల్ డిస్కో రాజా, వెంకీ మామా, అనగనగా ఓ అతిథి, పకపా. మాయాపేటిక, మంగళవారం వంటి సినిమాల్లో నటించింది. ఈ సినిమాల్లో మంగళవారం మూవీతో మరోసారి ఈ అమ్మడుకు మంచి గుర్తింపు వచ్చింది.
ఈ సినిమాలో పాయల్ తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ ఎప్పుడూ తన వరస ఫొటో షూట్ తో నెటిజన్స్ ను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ నటి, డెమిన్ క్లాత్ తో తయారు చేసిన సింగిల్ పీస్ షాట్ ధరించి తన అందాలతో మత్తెక్కిస్తుంది. డిఫరెంట్ ఫోజులతో ఉన్న ఈ ఫొటోలు నెటిజన్స్ ను తెగ ఆకట్టుకుంటున్నాయి.
ఇంకా చదవండి: అలియా భట్‌తో పోల్చకండి ప్లీజ్: నటి షాలినీ పాండే వెల్లడి
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!