పవన్‌కల్యాణ్-రవితేజతో మల్టీస్టారర్ ... మనసులో మాట బయటపెట్టిన హరీష్ శంకర్
4 months ago | 39 Views
సాధారణ కథకు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి తన టేకింగ్‌తో ప్రేక్షకులను అలరించే దర్శకుడు హరీశ్ శంకర్. రవితేజ కథానాయకుడిగా ఆయన దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ’మిస్టర్ బచ్చన్’ .భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న హరీశ్ శంకర్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మల్టీస్టారర్ తీయాల్సి వస్తే ఎవరితో తీస్తారని అడగ్గా, పవన్‌కల్యాణ్, రవితేజతో చేస్తానని అన్నారు. ఈ ఇద్దరిలో ఏ ఒక్కరు తెరపై కనిపించినా మాస్ ప్రేక్షకులు విజిల్స్ హోరెత్తిస్తారు. అలాంటిది ఇద్దరు హీరోలు ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే, పూనకాలతో ఊగిపోవడం ఖాయం. ఈ విషయం సామాజిక మాధ్యమాల వేదికగానూ ట్రెండ్ అవుతుండటంతో ఓ ట్వీట్‌కు కూడా హరీశ్ రిప్లై ఇచ్చారు.
’చాలా మంది చాలాసార్లు అడిగారు.అది కార్యరూపం దాల్చాలని ఆశిద్దాం’ అన్నారు. అలాగే, మహేశ్‌బాబుతోనూ ఒక సినిమా చేయాలని ఉందని అన్నారు. అది తన చిరకాల కోరిక అని అభిప్రాయపడ్డారు. అలాగే, కొన్ని సందర్భాల్లో దర్శకుడిగా తాను ఫెయిల్ అయి ఉండవచ్చు. కానీ, తన సినిమాల విషయంలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఎప్పుడూ ఫెయిల్ కాలేదని హరీశ్ శంకర్ చెప్పుకొచ్చారు. ఇక 'మిస్టర్ బచ్చన్’ విషయానికొస్తే, హిందీలో విజయవంతమైన 'రైడ్’కు రీమేక్‌గా దీన్ని తీసుకొస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన పాటలు, ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. రవితేజ నటన, హరీశ్ శంకర్ టేకింగ్‌తో పాటు, భాగ్యశ్రీ బోర్సే అందాలు సినిమాపై అంచాలను పెంచాయి. తొలి సినిమాతోనే సామాజిక మాధ్యమాల వేదికగా యువ హృదయాలను భాగ్యశ్రీ కొల్లగొడుతోంది.
ఇంకా చదవండి: వయనాడ్ బాధితులకు రెబెల్ స్టార్ ప్రభాస్ ఆపన్నహస్తం, 2 కోట్ల రూపాయల విరాళం అందజేత
# Pawankalyan # Raviteja # HarishShankar