పట్టాలెక్కని వేణు మూవీ.. దిల్‌రాజ్‌ దయతలిస్తేనే ముందుకు... !!

పట్టాలెక్కని వేణు మూవీ.. దిల్‌రాజ్‌ దయతలిస్తేనే ముందుకు... !!

2 months ago | 5 Views

నటుడిగా, కామెడీయన్‌గా మంచి గుర్తింపు పొందిన ఆర్టిస్ట్‌ వేణు యేల్దండి. జబర్దస్త్‌ షోతో స్టార్‌ కామెడీయన్‌గా ఎదిగిన వేణు.. 'బలగం’ సినిమా తీసి అందరిని ఆశ్చర్యపరిచాడు. తెలంగాణ మాండలికం, ఎమోషనల్‌ స్టోరీ నేరేటివ్‌తో తెలుగు రాష్ట్రాల్లోని  ప్రజలని కట్టిపడేసాడు. దీంతో ఆయన నెక్ట్స్‌ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సినిమా రిలీజై రెండేళ్లవుతున్నా.. ఇంకో ప్రాజెక్ట్‌ షూట్‌ ప్రారంభించకపోవడంతో అసలేమైందని చర్చ జరుగుతోంది. కథను ఇప్పటికే ఇద్దరు స్టార్‌ హీరోలకు నేరేట్‌ చేసిన వాళ్ళమేన్నారు.. ప్రొడ్యూసర్‌ దిల్‌ రాజు ఏమన్నాడంటే.. వేణు యేల్దండి.. తన 'బలగం' సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలో సంచలనమే సృష్టించాడు. ఈ సినిమాకి ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన దిల్‌ రాజే నెక్ట్స్‌ సినిమాకి కూడా కమిట్మెంట్‌ ఇచ్చాడు. దీంతో 'ఎల్లమ్మ’ కథ ఆధారంగా వేణు ఒక స్క్రిప్ట్‌ కూడా రెడీ చేసుకున్నాడు. మొదట ఈ స్టోరిని నేచురల్‌ స్టార్‌ నాని కి నేరేట్‌ చేసినట్లు వార్తలొచ్చాయి. అయితే కథ నచ్చకో, డేట్స్‌ ఖాళీలేకో నాని ఈ సినిమాని యాక్సెప్ట్‌ చేయలేదని టాక్‌ వినపడిరది. బేసిక్‌గా ప్రయోగాత్మక, ఉత్తమ కథాదీరిత సినిమాలు చేసే నాని ఇలా చేశాడేంటని అంతా అనుకున్నారు.

దీంతో వేణు ఈ కథను హీరో నితిన్‌కి వినిపించారట. స్టోరీ నచ్చిన నితిన్‌ ఈ ప్రాజెక్ట్‌ ఓకే చేశాడని కూడా సినీ వర్గాల్లో టాక్‌. బేసిక్‌గా దిల్‌ రాజు ప్రొడక్షన్‌ అంటే నితిన్‌ నో చెప్పే ఛాన్సే లేదంటున్నారు. ఇదిలా ఉండగా గురువారం జరిగిన ఓ సినిమా విూటింగ్‌కి డైరెక్టర్‌ వేణుతో పాటు నిర్మాత దిల్‌ రాజు కూడా అటెండ్‌ అయ్యాడు. ఈ నేపథ్యంలో దిల్‌ రాజు మాట్లాడుతూ.. 'ఏం వేణు ఎల్లమ్మ కథ ఎప్పుడు మొదలు పెడుతున్నావు’ అని ప్రశ్నించాడు. దీనికి వేణు స్పందిస్తూ.. విూరెప్పుడంటే అప్పుడే సార్‌ అన్నారు. ఈ నవంబర్‌లో షూట్‌ స్టార్ట్‌ చేద్దామా అన్నారు. దీనికి దిల్‌ రాజు నవ్వుతూ.. వద్దు ఫిబ్రవరిలో స్టార్ట్‌ చేద్దాము అంటూ సమాధానమిచ్చారు. దీంతో అనఫీషియల్‌గా ఈ ప్రాజెక్ట్‌కి హీరో సెలెక్ట్‌ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాబిన్‌హుడ్‌, తమ్ముడు సినిమాలతో బిజీగా ఉన్న నితిన్‌ ఈ ప్రాజెక్ట్‌ చేయనున్నట్లు టాక్‌.

ఇంకా చదవండి: 'స్వయంభూ' సెట్‌లో.. ఆయుధపూజ!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !

trending

View More