పద్మభూషణ్‌ పురస్కారం నందమూరి బాలకృష్ణని ఘనంగా సన్మానించిన 'అఖండ 2: తాండవం' టీం

పద్మభూషణ్‌ పురస్కారం నందమూరి బాలకృష్ణని ఘనంగా సన్మానించిన 'అఖండ 2: తాండవం' టీం

18 days ago | 5 Views

ప్రతిష్టాత్మక పద్మభూషణ్‌ పురస్కారం పొందిన గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారిని 'అఖండ 2: తాండవం' మూవీ టీం సెట్ లో సన్మానించింది. పద్మభూషణ్‌ పురస్కారం పొందిన తర్వాత ఈ రోజు బాలయ్య షూటింగ్ కు వచ్చారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ బాలయ్య ను ఘనంగా సన్మానించారు. కేక్ ని కట్ చేసి తమ అభినందనలు తెలియజేశారు.  


బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను హైలీ యాంటిసిపేటెడ్ మూవీ 'అఖండ 2: తాండవం'. ఇది వారి మునుపటి బ్లాక్ బస్టర్ అఖండకు ఈ సీక్వెల్ యాక్షన్, ఇంటెన్స్ నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లనుంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మించిన ఈ చిత్రాన్ని ఎం తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. 

ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ సీక్వెల్‌ను భారీ బడ్జెట్‌తో బిగ్ కాన్వాస్‌పై నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 25, 2025న దసరా సందర్భంగా థియేటర్ లో విడుదల కానుంది.

ఇంకా చదవండి: "తల్లి మనసు" చిత్రానికి వినోదపుపన్ను మినహాయింపు ఇవ్వాలి:ఆర్.నారాయణమూర్తి

Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# నందమూరి బాలకృష్ణ     # పద్మభూషణ్‌ పురస్కారం    

trending

View More