
సినిమాలో అవకాశాలు తగ్గాయి .. యాడ్స్‌తోనే సంపాదిస్తున్నా : ప్రకాష్‌వారియర్
12 days ago | 5 Views
నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టింది. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా ఫేమస్ అయ్యింది.తర్వాత సినీరంగంలోకి నటిగా ఎంట్రీ ఇచ్చింది. కథానాయికగా ఆమె నటించిన ఫస్ట్ మూవీ సంచలన విజయం సాధించింది. ముఖ్యంగా అందులో ఆమె కనిపించిన సీన్స్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో దూసుకుపోయాయి. కట్ చేస్తే.. స్టార్ హీరోయిన్‌గా క్రేజ్ సొంతం చేసుకుంది. కానీ అం దం, అభినయం కట్టిపడేసిన ఈ బ్యూటీకి అదృష్టం మాత్రం కలిసిరావడం లేదు. ఆమె నటించిన చిత్రాలు డిజాస్టర్స్ కావడంతో నెమ్మదిగా అవకాశాలు తగ్గిపోయాయి. కానీ సోషల్ మీడియాలో గ్లామర్ ఫోజులతో మెంటలెక్కిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆ బ్యూటీ మాట్లాడుతూ.. తనకు ఎవరూ అవకాశాలు ఇవ్వడం లేదని.. కానీ తాను మాత్రం సోషల్ మీడియా పేజీల ద్వారా ఆదాయం సంపాదిస్తున్నానని తెలిపింది హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్. ఒకే ఒక్క సినిమాతో మలయాళీ ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న నటి ప్రియా ప్రకాష్ వారియర్. ఒమర్ లులు దర్శకత్వం వహించిన ఒరు అదార్ లవ్ చిత్రంలోని ఒక పాటలో కన్నుగీటుతూ కనిపించి ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత నెట్టింట తెగ ట్రెండ్ అయ్యింది. అలాగే మలయాళంలో వరుస ఆఫర్స్ అందుకుంది.
ఒక్క రోజులోనే లక్షలాది మంది ఆ నటిని ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయ్యారు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రకటనలు, ప్రమోషన్ ద్వారా దృష్టిని ఆకర్షించింది. దీనివల్ల స్టార్‌కు మంచి ఆదాయం వచ్చింది. ఈ విషయాన్ని ఆ స్టార్ స్వయంగా బహిరంగంగా చెప్పడంతో ఇప్పుడు అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమా లేకపోయినా బ్రాండ్ల నుండి ప్రకటనలు వస్తున్నందుకు ఉపశమనం కలిగిస్తోందని తెలిపింది. కానీ తన లక్ష్యం మాత్రం సినిమాల్లో నటించడమే అని తెలిపింది.
ఇంకా చదవండి: ఒకప్పుడు రూ. 2500 కోసం డ్యాన్స్ చేసిన బ్యూటీ
"Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!"