'దేవర'లోని 'చుట్టమల్లె' పాటకు వందమిలియన్ వ్యూవర్స్!
3 months ago | 31 Views
పాన్ ఇండియా మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలుగు సినిమాల్లో 'దేవర'. జూనియర్ ఎన్టీఆర్ టైటిల్‌లో రోల్ పోషిస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ 'దేవర' రెండు పార్టులుగా తెరకెక్కుతుండగా.. దేవర పార్టు 1 సెప్టెంబర్ 27న గ్రాండ్‌గా విడుదల కానుంది. మేకర్స్ ఇప్పటికే మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా చుట్టమ్లలె మెలోడీ ట్రాక్‌ను విడుదల చేశారని తెలిసిందే. తారక్, జాన్వీకపూర్ కెమిస్ట్రీలో వచ్చే ఈ డ్యుయెట్ సాంగ్ సినిమాకే హైలెట్‌గా ఉండబోతుందని విజువల్స్ చెప్పకనే చెబుతున్నాయి. ఈ సాంగ్ మ్యూజిక్ లవర్స్ ను ఇంప్రెస్ చేసి నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది. 'చుట్టమ్లలె..' పాట విడుదలైన నెలలోపే (29 రోజులు) యూట్యూబ్‌లో 100 మిలియన్లకుపైగా వ్యూస్‌తో నంబర్ 1 స్థానంలో ట్రెండింగ్ లో నిలుస్తుంది.
ఈ సాంగ్ నాలుగు వారాలుగా మోస్ట్ ట్రెండింగ్ జాబితాలో కొనసాగుతుండటం విశేషం. తారక్, జాన్వీకపూర్ కాంబోను మూవీ లవర్స్ ఏ స్థాయిలో ఎంజాయ్ చేస్తున్నారో చెప్పేందుకు ఇది ఒక ఉదాహరణ. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను శిల్పా రావు పాడింది. ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ భైర పాత్రలో నటిస్తుండగా.. విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్, మలయాళ యాక్టర్ టామ్ ఛాకో, శ్రీకాంత్, మురళీ శర్మ, హిమజ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొనరాజు హరికృష్ణ, కల్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇంకా చదవండి: రాజమౌళి స్ఫూర్తితో 'గోట్' సినిమా నిర్మాణం!
# Devara # Janhvikapoor # Saifalikhan # Jrntr