ఒకప్పుడు రూ. 2500 కోసం డ్యాన్స్‌ చేసిన బ్యూటీ

ఒకప్పుడు రూ. 2500 కోసం డ్యాన్స్‌ చేసిన బ్యూటీ

15 days ago | 5 Views

కోలీవుడ్‌ ఇండస్ట్రీ తండ్రి స్టార్‌ హీరో. ఇప్పటివరకు అనేక చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తండ్రి బాటలోనే సినీప్రయాణం స్టార్ట్‌ చేసింది కూతురు. కథానాయికగా సినీరంగంలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకుంది. కానీ ఆ తర్వాత ఊహించని విధంగా పవల్‌ ఫుల్‌ విలన్‌గా మారి సత్తా చాటుతుంది.  ప్రస్తుతం కోట్లాకు యజమానిగా మారిన ఆమె.. ఒకప్పుడు రూ.2500 కోసం రోడ్డుపై డ్యాన్స్‌ చేసింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. తమిళ్‌ స్టార్‌ బ్యూటీ వరలక్ష్మీ శరత్‌ కుమార్‌. స్టార్‌ హీరో శరత్‌ కుమార్‌ కూతురే ఆమె. తండ్రి సపోర్ట్‌ లేకుండానే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి సెపరేట్‌ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకుంది. నయనతార భర్త విఘ్నేశ్‌ దర్శకత్వం వహించిన పోడా పోడి సినిమాతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది వరలక్ష్మి శరత్‌ కుమార్‌.

Varalaxmi Sarathkumar looks breathtaking in 'Hanu Man' first-look poster |  Telugu Movie News - Times of India

ఆ తర్వాత తమిళంలో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. అయితే నటిగా ప్రశంసలు అందుకున్నప్పటికీ ఆఫర్స్‌ మాత్రం రాలేదు. దీంతో కొన్నాళ్లు సైలెంట్‌ అయిన ఆమె.. తర్వాత విలన్‌ పాత్రతో రీఎంట్రీ ఇచ్చింది. ముఖ్యంగా తెలుగులో విలన్‌ పాత్రలతోనే ఫేమస్‌ అయ్యింది. తెలుగు,తమిళం, మలయాళం, కన్నడ భాషలలో నటిస్తూ ఫుల్‌ బిజీగా ఉంటుంది. డేరింగ్‌ నటిగా పేరు సంపాదించుకుంది. ఇటీవలే తన స్నేహితుడు నికోలాయ్‌ సచ్‌ దేవ్‌ ను ప్రేమించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంది. ఇదిలా ఉంటే.. ఇటీవల ఓ డ్యాన్స్‌ షోలో తన భర్తతో కలిసి పాల్గొంది వరలక్ష్మి. ఆ షోలో ముగ్గురు పిల్లల తల్లి డ్యాన్స్‌ చేయడం చూసి ఆశ్చర్యపోయింది. ఈ క్రమంలోనే ఆమె మాట్లుడుతూ.. తాను ఇప్పటివరకు ఎవరికీ చెప్పని రహస్యాన్ని చెబుతానని తెలిపింది. గతంలో తాను రోడ్డుపైనే డ్యాన్స్‌ చేసిన సందర్భాలు ఉన్నాయని తెలిపింది. రూ.2500 కోసం ఫస్ట్‌ టైం ఓ షో కోసం రోడ్డు మీద డ్యాన్స్‌ చేశానని తెలిపింది. రోడ్స్‌ మీద డ్యాన్స్‌ చేయడం ఎవరూ తప్పుగా భావించవద్దని తెలిపింది.
ఇంకా చదవండి: ఆ సినిమాలో రామ్‌చరణ్‌తో గిన్నెలు తోమించిన సుకుమార్‌

"Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!"

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# వరలక్ష్మీశరత్‌     # స్టార్‌    

trending

View More