శ్రీలీలకు ఆఫర్ల మీద ఆఫర్లు..!

శ్రీలీలకు ఆఫర్ల మీద ఆఫర్లు..!

10 days ago | 5 Views

శ్రీలీల ప్రధానంగా తెలుగు, కన్నడ సినిమాల్లో హీరోయిన్‌ గా నటిస్తుంది. ఆమె 2017లో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. 2019 కన్నడ కిస్‌తో పాటు తెలుగులో పెళ్లి సందడి, ధమాకా వంటి చిత్రాలతో మంచి పేరు తెచ్చుకుంది. తెలుగు ఉత్తమ నటిగా  అవార్డును గెలుచుకుంది ఈ బ్యూటీ. తర్వాత తెలుగు వరుస సినిమాలు చేస్తు బిజీగా ఉన్న ఈ వయ్యారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం రండి..  14 జూన్‌  2001న  డెట్రాయిట్‌ లోని మిచిగాన్‌ లో ఒక తెలుగు కుటుంబంలో జన్మించింది శ్రీలీల. బెంగుళూరులో పెరిగింది. ఆమె తల్లి స్వర్ణలత బెంగళూరులో గైనకాలజిస్ట్‌. స్వర్ణలత పారిశ్రామికవేత్త సూరపనేని శుభాకరరావుతో విడిపోయిన తర్వాత స్వర్ణలతకు లీల జన్మించింది.  తన చిన్నతనంలోనే 5 ఏళ్ల వయసులో భరతనాట్యంలో శిక్షణ ప్రారంభించింది. ఆమె డాక్టర్‌ కావాలని కోరికతో 2022లో ఆమె చివరి పూర్తి చేసింది ఈ వయ్యారి.  2017లో చిత్రాంగద అనే తెలుగు హారర్‌ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది.


ఈ సినిమలో ప్రధాన పాత్రలో కనిపించిన సింధు తోలాని చిన్నప్పటి పాత్రలో నటించింది . తర్వాత కిస్‌ అనే కన్నడ చిత్రంతో తొలిసారి కథానాయకిగా కనిపించింది.  2021లో పెళ్లి సందడి సినిమాతో కథానాయకిగా తెలుగు చలనచిత్ర అరంగేట్రం చేసింది. ఇందులో ఈమె నటనకి సైమా వైదికపై మోస్ట్‌ ప్రామిసింగ్‌ న్యూకమర్‌ అవార్డు అందుకుంది. తర్వాత ధమాకా చిత్రంలో హీరోయిన్‌ గా నటించి బ్లాక్‌ బ్లాక్‌ బస్టర్‌ అందుకుంది. దీనికి సైమా ద్వారా ఉత్తమ నటి అవార్డు అందుకుంది. తర్వాత వరుస సినిమాలు చేసింది. 2023లో స్కంద, భగవంత్‌ కేసరి, ఆదికేశవ, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌, వంటి సినిమాల్లో నటించగా భగవంత్‌ కేసరి మాత్రమే ఆకట్టుకుంది.  2024లో  గుంటూరు కారంలో నటించిన అది ఆశించిన ఫలితాన్నిఅందుకోలేకపోయింది. అదే ఏడాది పుష్పా 2లో స్పెషల్‌ సాంగ్‌ చేసి అలరించింది. ప్రస్తుతం నితిన్‌ సరసన రాబిన్‌?హుడ్‌, రవితేజకి జోడిగా మాస్‌ జాతర,  పవన్‌ కళ్యాణ్‌ పక్కన ఉస్తాద్‌ భగత్‌ ?సింగ్‌ చిత్రాల్లో నటిస్తుంది. అలాగే తమిళంలో శివ కార్తికేయన్‌ హీరోగా వస్తున్న పరాశక్తిలో కథానాయికగా నటిస్తుంది. వీటితో పాటు హిందీలో ఓ సినిమాకి సైన్‌ చేసింది.

ఇంకా చదవండి: సినిమాలో అవకాశాలు తగ్గాయి .. యాడ్స్‌తోనే సంపాదిస్తున్నా : ప్రకాష్‌వారియర్‌

Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# శ్రీలీల     # పవన్‌ కళ్యాణ్‌    

trending

View More