డ్రగ్స్‌తో ఎలాంటి సంబంధం లేదు: పదేపదే ప్రచారంపై నటి హేమ మండిపాటు!
2 months ago | 24 Views
బెంగళూరు రేవ్ పార్టీలో టాలీవుడ్ సినీ నటి హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు కేసు నమోదు కాగా..తాను డ్రగ్స్ తీసుకోలేదని హేమ వాదిస్తోంది. హేమ డ్రగ్స్ తీసుకున్నట్టు నివేదికలో పేర్కొన్న పోలీసులు ఎండీఎంఏ మెడికల్ రిపోర్ట్‌ను కూడా జత చేశారు. ఈ కేసులో నటి హేమతోపాటు 88 మంది డ్రగ్స్ తీసుకున్నారని పోలీసులు వివరించారు. చార్జీషీట్‌లో రేవ్ పార్టీ నిర్వాహకులుగా 9 మందిని పేర్కొన్నారు.అయితే తాను డ్రగ్స్ తీసుకున్నట్లు పలు విూడియా ఛానళ్లు ప్రచారం చేయడంపై నటి హేమ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఒక వీడియోను సోషల్ విూడియా వేదికగా విడుదల చేశారు.
నేను డ్రగ్స్ తీసుకున్నట్లు గతంలో ఎలా అయితే పలు విూడియా ఛానళ్లు ప్రచారం చేశారో.. అదే పాత వార్తలను తీసుకువచ్చి మళ్లీ ప్రచురిస్తున్నారు. హేమకు పాజిటివ్ వచ్చింది అంటూ ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారు. పోలీసులు దాఖలు చేసిన ఛార్జిషీట్ నేనే ఇంకా చూడలేదు. విూరు ఎలా చూశారు అంటూ విూడియాపై మండిపడిరది హేమ. తానే స్వయంగా విూడియా పెద్దల వద్దకు వస్తానని.. వారే టెస్ట్ చేయించాలని హేమ సవాల్ విసిరారు. డ్రగ్స్ తీసుకున్నట్లు తేలితే ఎంతటి శిక్షైనా అనుభవిస్తానని నెగిటివ్ వస్తే తనకు న్యాయం చేయాలన్నారు. పరువు కోసం చచ్చిపోవడానికైనా సిద్ధమని హేమ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ విూడియాలో వైరల్‌గా మారింది.
ఇంకా చదవండి: పూనమ్ కౌర్ ఆరోపణలపై ఫిలిం చాంబర్ స్పందన .. నేరుగా లేదా..మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచన!!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !
# Hema # RaveParty # Tollywood