సూర్య, రామ్ చరణ్ పేర్లు చెప్పిన డైరెక్టర్ నార్తన్
24 days ago | 5 Views
కన్నడ స్టార్ యాక్టర్ శివరాజ్‌కుమార్ హీరోగా నార్తన్ డైరెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. రీసెంట్‌గా ఈ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన భైరథి రణగల్‌తో మరో హిట్టందుకున్నాడు నార్తన్. కాగా ఈ టాలెంటెడ్ డైరెక్టర్ నెక్ట్స్ సినిమాపై చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. నా కొత్త ప్రాజెక్టు కేవీఎన్ ప్రొడక్షన్స్ తో చేయబోతున్నా. కానీ హీరోపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. లీడ్ రోల్ కోసం సూర్య, రామ్ చరణ్ పేర్లను పరిశీలిస్తున్నాం. కన్నడ యాక్టర్ పేరు కూడా ఉంది. హీరోను ఫైనల్ చేసిన తర్వాత ప్రొడక్షన్ హౌస్ నుంచి అధికారిక ప్రకటన చేస్తామని చెప్పాడు నార్తన్.
రామ్ చరణ్ నార్తన్‌తో సినిమా చేయబోతున్నాడని చాలా కాలంగా పుకార్లు తెరపైకి వస్తున్నా.. ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. ఇప్పుడిక నార్తన్ టాలీవుడ్ యాక్టర్ రామ్ చరణ్ పేరు ప్రస్తావించడంలో దాదాపు ఈ ప్రాజెక్ట్‌లో ఫైనల్ అయిపోయినట్టేనని అభిమానులు తెగ ఎక్జయిట్ అవుతున్నారు. రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఆర్‌సీ 16 సినిమా చేస్తున్నాడని తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. మరోవైపు సూర్య ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజు, ఆర్జే బాలాజీ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో మరి ఇద్దరిలో ఏ యాక్టర్ ముందుగా నార్తన్‌కు డేట్స్ కేటాయిస్తాడన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇంకా చదవండి:
# సూర్య # రామ్ చరణ్ # నార్తన్