మరో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు :  ఓ ఇంటర్వ్యూలో నటుడు అవిూర్‌ ఖాన్‌

మరో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు : ఓ ఇంటర్వ్యూలో నటుడు అవిూర్‌ ఖాన్‌

3 months ago | 38 Views

ఇప్పటికైతే మరో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని బాలీవుడ్‌ మిస్టర్‌ పర్ఫెక్ట్‌  ఆమిర్‌ ఖాన్‌ అన్నారు. తనపై అనేక బాధ్యతలు ఉన్నాయని, అందువల్ల ఇది సాధ్యం కాదేమో అంటూ సెలవిచ్చారు. తన వ్యక్తిగత జీవితంపై ఇలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  వైవాహిక బంధంపై మాట్లాడారు. నటి రియా చక్రవర్తి నిర్వహిస్తున్న పాడ్‌కాస్ట్‌లో ఆయన పాల్గొన్నారు. ఇందులో రియా అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర విషయాలు తెలిపారు. బంధం ఏదైనా సరే.. సక్సెస్‌ లేదా ఫెయిల్యూర్‌ అనేది ఇద్దరు వ్యక్తులపై ఆధారపడి ఉంటుంది. వివాహ వ్యవస్థ ఇప్పుడు ఎంతో మారింది. వివాహ బంధం సక్సెస్‌ కావాలంటే ఏం చేయాలని రియా చక్రవర్తి ప్రశ్నించగా.. వైవాహిక బంధానికి సంబంధించి నేను రెండుసార్లు ఫెయిల్‌ అయ్యాను. కాబట్టి పెళ్లి విషయంలో నా సూచనలు తీసుకోకపోవడం మంచిది. నాకు ఒంటరిగా జీవించడం ఇష్టం ఉండదు. నాకంటూ ఒక భాగస్వామి ఉండాలని కోరుకుంటా. ఒకరితో కలిసి ఉండటం.. ఇష్టాయిష్టాలు, కష్ట సుఖాలు వారితో పంచుకోవడం నాకు ఇష్టం.

నా మాజీ సతీమణులు రీనా, కిరణ్‌తో నాకెంతో మంచి అనుబంధం ఉంది.  నా దృష్టిలో మేమంతా ఒకే కుటుంబం. జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం. కాబట్టి వైవాహిక బంధం సక్సెస్‌ అవుతుందా లేదా అనేది మనం ఎలా చెప్పగలం అని సమాధానమిచ్చారు. అనంతరం, మరో  వివాహం చేసుకునే ఆలోచన ఉందా? అని అడగ్గా.. నా వయసు 59 ఏళ్లు. ఇప్పుడు నాకు మళ్లీ పెళ్లి అంటే చాలా కష్టంగా ఉంది. ప్రస్తుతం నాకు ఎన్నో బాధ్యతలు ఉన్నాయి.

నా కుటుంబం, పిల్లలు, స్నేహితులతో రీ కనెక్ట్‌ అయ్యా.  నాకెంతో ఇష్టమైన వారితో సంతోషంగా సమయాన్ని ఆస్వాదిస్తున్నా. నన్ను నేను మరింత ఉన్నతంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నానని ఆమిర్‌ఖాన్‌ అన్నారు. 1986లో రీనాదత్తాను ప్రేమించి పెళ్లాడారు ఆమిర్‌ ఖాన్‌. 2002లో విడాకులు తీసుకున్నారు. అనంతరం ఆయన కిరణ్‌రావును వివాహం చేసుకున్నారు. 'లగాన్‌’కు పని చేస్తున్న సమయంలో వీరి మధ్య స్నేహం కుదిరింది. పెద్దల అంగీకారంతో 2005లో వీరి వివాహం జరిగింది. 16 ఏళ్ల వైవాహిక బంధానికి 2021లో వీరిద్దరూ స్వస్తి పలికారు.

ఇంకా చదవండి: నటుడు సిద్దిఖీ తనపై అత్యాచారం... రేవతి సంపత్‌ ఆరోపణలతో సెక్రెటరీ పదవికి రాజీనామా

# Aamir Khan     # Netflix    

trending

View More