నిన్నెవరూ మ్యాచ్ చేయలేరు.. 'అన్‌మ్యాచ్‌బుల్’ : రామ్‌చరణ్‌కు సమంత కితాబు!
2 months ago | 5 Views
హీరో రామ్‌చరణ్ నటిస్తున్న 'గేమ్ ఛేంజర్' నుంచి తాజాగా 'రా మచ్చా మచ్చా..’ అంటూ రెండో పాట విడుదలైంది. ఈ పాట ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ క్రమంలో పాటలో రామ్‌చరణ్ డ్యాన్స్‌పై ఉపాసన, సమంతలు ప్రశంసలు కురిపించారు. రామ్‌చరణ్ తన పాటను షేర్ చేస్తూ.. 'ఈ భారీ పాటను నేను ఆనందించినట్లు.. విూరూ ఆనందిస్తున్నారని ఆశిస్తున్నా’ అని రాశారు. ఈ పోస్ట్‌పై ఉపాసన స్పందిస్తూ.. మిస్టర్ సీ.. విూ డ్యాన్స్‌తో హై ఓల్టేజ్ పుట్టించారని రిప్లై ఇచ్చారు. ఇక, సమంత స్పందిస్తూ.. నిన్నెవరూ మ్యాచ్ చేయలేరు అంటూ.. 'అన్‌మ్యాచ్‌బుల్’ అని పేర్కొన్నారు. దానికింద ఫార్మల్ ప్యాంట్, షర్ట్ ధరించి ఎవరు ఇలా డ్యాన్స్ చేయగలరు.. అంటూ రాసుకొచ్చారు.
ఇదిలాఉండగా.. రామ్‌చరణ్ కథానాయకుడిగా, శంకర్ దర్శకత్వంలో 'గేమ్‌ఛేంజర్’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలోని 'రా మచ్చా మచ్చా’... పాటని విడుదల చేశారు. ఈ పాటకి తమన్ స్వరాలు సమకూర్చగా, అనంత శ్రీరామ్ సాహిత్యం అందించారు. నకాశ్ అజీజ్ ఆలపించారు. ఈ సినిమా క్రిస్మస్ సందర్భంగా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రంలో రామ్‌చరణ్‌తో కియారా అద్వానీ, అంజలి, ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, జయరామ్, నవీన్‌చంద్ర, ప్రకాశ్‌రాజ్‌తో పాటు పలువురు కీలక ప్రాతల్లో నటిస్తున్నారు.
ఇంకా చదవండి: పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో "దీక్ష"
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !
# Gamechanger # Ramcharan # Kiaraadvani # Samantha