.webp)
బ్యాగ్రౌండ్ లేకున్నా...తనదైన శైలిలో సినిమాలు...
1 month ago | 5 Views
సోషల్ మీడియాలో సినీతారల చిన్ననాటి ఫోటోస్ తెగ వైరలవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో హీరోయిన్ చైల్డ్ హుడ్ పిక్ నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. పైన ఫోటోలో తన తండ్రితో కలిసి ఉన్న చిన్నారి ఎవరో తెలుసా.. ? తెలుగు సినీ పరిశ్రమలో నటిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ లేకుండానే సినిమాల్లోకి అడుగుపెట్టి సహజ నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తెలుగుతో పాటు తమిళంలోనూ వరుస ఆఫర్స్ అందుకుంది. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. ఇటీవలే భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలోనూ కీలకపాత్ర పోషించింది. ఎలాంటి పాత్రలోనైనా అవలీలగా జీవించే అందమైన హీరోయిన్. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా..? తనే హీరోయిన్ అంజలి. ఏపీకి చెందిన ఈ అమ్మాయి.. జీవా నటించిన డేర్ సినిమాతో తెరంగేట్రం చేసింది. తర్వాత 2006లో ఫోటో సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది. అయితే ఈ రెండు సినిమాలు అంజలికి అంతగా గుర్తింపు తీసుకురాలేదు. కానీ తమిళంలో సూపర్ హిట్ అయిన 'షాపింగ్ మాల్' సినిమాతో ఈ అమ్మడు క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఆ చిత్రాన్ని తెలుగులో డబ్ చేయగా.. అదే స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది.
డైరెక్టర్ మురుగదాస్ తెరకెక్కించిన జర్నీ సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు వచ్చింది. ఈ రెండు సినిమాలు అంజలి కెరీర్ మలుపు తిప్పాయి. 2013లో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సీత పాత్రలో కనిపించింది. అంజలి.. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆ తర్వాత అనేక చిత్రాల్లో నటించింది. గ్లామర్ షోలు కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంపిక చేసుకుంటూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అలాగే లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ నటించి మెప్పించిన అంజలి.. ఇటీవలే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ మూవీలో కీలకపాత్ర పోషించింది. డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కియారా అద్వానీ కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే.
ఇంకా చదవండి: మళ్లీ రాజకీయాల్లోకి వచ్చే ఛాన్సే లేదు : మెగాస్టార్ చిరంజీవి
"Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!"