నితిన్, వెంకీ కుడుముల, మైత్రీ మూవీ మేకర్స్ రాబిన్‌హుడ్‌లో హాటెస్ట్ అవతార్‌లో కేతిక శర్మను ప్రజెంట్ చేస్తూ స్పెషల్ సాంగ్ "అది ధ సర్ప్రైజ్" విడుదల
17 days ago | 5 Views
వెంకీ కుడుముల దర్శకత్వంలో హీరో నితిన్ నటించిన రాబిన్ హుడ్ చిత్రం నుంచి అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూడవ సింగిల్ "అది ధ సర్ప్రైజ్" ను విడుదల చేశారు. మొదటి రెండు పాటలు బ్లాక్ బస్టర్స్ అయిన తర్వాత ఈ పాటను ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటించింది.
టైటిల్ కి తగినట్లుగా, ఈ పాట కేతిక శర్మ పాత్ర చుట్టూ ఉన్న ఆశ్చర్యకరమైన మరియు హాస్యభరితమైన సంఘటనల శ్రేణిని ప్రదర్శిస్తుంది.జివి ప్రకాష్ కుమార్ బీట్‌లతో కూడిన హై-ఎనర్జీ మాస్ పాటను అందించారు మరియు వీణ, నాదస్వరం జోడించడం వలన దానికి ప్రత్యేకమైన, క్లాసీ టచ్ వచ్చింది.
ఈ ప్రత్యేక పాటలో కేతికా శర్మ తన అద్భుతమైన జాస్మిన్ బ్లౌజ్ మరియు ఎనర్జిటిక్ డాన్స్ మూవ్స్ తో తన గ్లామర్ ని జోడించి, పాటను విజువల్ ట్రీట్‌గా మార్చింది. సోషల్ మీడియా లో ఇన్స్టంట్ హిట్ గా నిలిచిన ఈ పాట థియేటర్స్ లో ప్రేక్షకులను డాన్స్ చేపించడం పక్కాగా కనిపిస్తుంది.
నీతి మోహన్ మరియు అనురాగ్ కులకర్ణి తమ అద్భుతమైన గాత్రాలతో ఈ పాటకు ప్రాణం పోశారు, అకాడమీ అవార్డు గ్రహీత చంద్రబోస్ రాసినసాహిత్యం పాటకు అదనపు ఆకర్షణగా నిలిచింది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ పాట వైబ్ కి తగ్గట్టు మంచి ఎనర్జిటిక్ గా ఉంది. "అది ధ సర్ప్రైజ్" నిస్సందేహంగా ఈ సంవత్సరం అత్యంత హాటెస్ట్ పాటలలో ఒకటిగా తన స్థానాన్ని సంపాదించుకుంది. ఈ పాటలో చివరి విజువల్స్‌లో నితిన్ మరియు శ్రీలీల కలిసి చేసిన డాన్స్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకు వెళ్ళింది.
నవీన్ యెర్నేని మరియు వై రవిశంకర్ నిర్మించిన రాబిన్‌హుడ్ మార్చి 28న పెద్ద తెరపైకి రానుంది. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ, కోటి ఎడిటర్. రాం కుమార్ ఆర్ట్ డైరెక్టర్.
విడుదల దగ్గర పడుతుండటంతో, చిత్ర యూనిట్ ప్రొమోషన్స్ లో జోరుని పెంచి ప్రేక్షకుల్లో సినిమా పై అన్ని రకాలుగా క్యూరియాసిటీ పెంచుతుంది.
తారాగణం: నితిన్, శ్రీలీల, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ తదితరులు
సాంకేతిక సిబ్బంది:
రచయిత, దర్శకుడు: వెంకీ కుడుముల
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
నిర్మాతలు: నవీన్ యెర్నేని మరియు వై రవిశంకర్
CEO: చెర్రీ
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
DOP: సాయి శ్రీరామ్
ఎడిటర్: కోటి
ఆర్ట్ డైరెక్టర్: రామ్ కుమార్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హరి తుమ్మల
లైన్ ప్రొడ్యూసర్: కిరణ్ బళ్లపల్లి
ఫైట్స్: రామ్-లక్ష్మణ్, రవివర్మ, వికారం మోర్
పబ్లిసిటీ డిజైనర్: గోపి ప్రసన్న
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో
ఇంకా చదవండి: నితిన్, వెంకీ కుడుముల, మైత్రీ మూవీ మేకర్స్ రాబిన్‌హుడ్‌లో హాటెస్ట్ అవతార్‌లో కేతిక శర్మను ప్రజెంట్ చేస్తూ స్పెషల్ సాంగ్ "అది ధ సర్ప్రైజ్" విడుదల
"Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!"