సూప‌ర్ స్టార్ మ‌హేష్ ప్ర‌శంస‌లు అందుకున్న నిహారిక కొణిదెల ‘కమిటీ కుర్రోళ్ళు’

సూప‌ర్ స్టార్ మ‌హేష్ ప్ర‌శంస‌లు అందుకున్న నిహారిక కొణిదెల ‘కమిటీ కుర్రోళ్ళు’

4 months ago | 47 Views

నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమాకు య‌దు వంశీ ద‌ర్శ‌కుడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ఆగస్ట్ 9న వంశీ నందిపాటి విడుదల చేశారు. డిఫరెంట్ కంటెంట్‌తో ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్‌, అటు యూత్‌ను ఆక‌ట్టుకున్న ఈ చిత్రం సూప‌ర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అలాగే బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబట్టుకుంటోంది. 

ప్రేక్ష‌కులు, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు సినీ సెల‌బ్రిటీల అప్రిషియేష‌న్స్ కూడా అందుకుంటోంది. తాజాగా సూప‌ర్ స్టార్ మ‌హేష్ ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్ర యూనిట్‌ను సోష‌ల్ మీడియా ద్వారా అభినందించారు. ‘‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాకు సంబంధించి మంచి విష‌యాల‌ను విన్నాను. తొలి చిత్రంతో నిర్మాత‌గా స‌క్సెస్‌గా సాధించిన నిహారిక కొణిదెల‌కు అభినంద‌న‌లు. సినిమాలో స‌క్సెస్‌లో భాగ‌మైన చిత్ర యూనిట్‌కు అభినంద‌న‌లు. సినిమాను త్వ‌ర‌లోనే చూస్తాను’ అంటూ మ‌హేష్ తెలియ‌జేశారు. 

కమిటీ కుర్రోళ్ళు’ చిత్రంలో సీనియ‌ర్ న‌టీన‌టుల‌తో పాటు 11 మంది హీరోలు, న‌లుగురు హీరోయిన్స్‌ను తెలుగు సినిమాకు ప‌రిచ‌యం చేస్తూ మేక‌ర్స్ చేసిన ఈ ప్ర‌య‌త్నాన్ని అభినందిస్తూ ప్రేక్ష‌కులు సినిమాను ఆద‌రించార‌ని ..ఆదివారం కూడా ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందుతుంద‌ని, క‌లెక్ష‌న్స్ మ‌రింత పెరుగుతాయ‌ని ట్రేడ్ వ‌ర్గాలంటున్నాయి.

ఇంకా చదవండి: నేను ఒంటరినని చెప్పలేదే: కీర్తిసురేశ్‌

# CommitteeKurrollu     # NiharikaKonidela     # MaheshBabu