ఇంకెప్పుడూ నటించొద్దు అన్నారు : రష్మిక

ఇంకెప్పుడూ నటించొద్దు అన్నారు : రష్మిక

11 days ago | 5 Views

పుష్ప 2’తో పాన్‌ ఇండియా స్థాయిలో అభినందనలు అందుకుంటున్న అందాల తార రష్మిక.. తన తాజా ఇంటర్వ్యూ ద్వారా ఆనందాన్ని వ్యక్తంచేస్తూ.. పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.  ‘శ్రీవల్లి’ లాంటి పాత్ర చేసినందుకు నన్నందరూ మంచి నటి అని మెచ్చుకుంటున్నారు. కానీ నా స్కూల్‌ టైమ్‌లో ఓసారి స్టేజ్‌ షో చేశా. అది ఎవరికీ నచ్చలేదు. కొందరైతే.. ‘ఇంకెప్పుడూ నటించకు’ అని ఉచిత సలహా కూడా పారేశారు’ అంటూ అందంగా నవ్వేసింది రష్మికమందన్నా. ఇంకా చెబుతూ ‘పదిమందిలో ఉన్నప్పుడు అక్కడ నన్నెవరూ నవ్వుతూ పలకరించకపోతే.. ఆ ప్రదేశంలో నేనుండలేను. అది నా బలహీనత. అంతేకాదు, కొన్ని రూమర్ల వల్ల కూడా కన్నీరు పెట్టుకున్న సందర్భాలున్నాయి.

Rashmika Mandanna: మరోసారి వివాదాస్పదమైన రష్మిక | Rashmika Mandanna creates  another controversy

నా రెమ్యునరేషన్‌ గురించి ఏవేవో రాశారు. నిజానికి డబ్బు గురించి అస్సలు పట్టించుకోను. తొలి సినిమాకు తీసుకున్న పారితోషికం కేవలం రెండున్నర లక్షలు. నాకు క్యారెక్టర్‌ ముఖ్యం. అయితే.. డబ్బు తక్కువ ఇచ్చినా పర్లేదు కానీ.. ఫ్రీగా మాత్రం చేయకూడదనేది నా పాలసీ’ అని చెప్పారు ‘ఓ మంచి బయోపిక్‌లో నటించాలి. అలాగే.. ‘బాహుబలి’లో దేవసేన లాంటి పాత్ర చేయాలి. ఈ రెండు కోరికలు ఎప్పుడు తీరతాయా అని ఎదురు చూస్తున్నా’ అని తెలిపారు రష్మిక. ప్రస్తుతం రెయిన్‌బో, ది గర్ల్‌ఫ్రెండ్‌, కుబేర, సికిందర్‌, ఛావా, థామ చిత్రాల్లో నటిస్తూ ఆమె బిజీబిజీగా ఉన్నది.

ఇంకా చదవండి: అమీర్‌ఖాన్‌ తనయుడితో సాయిపల్లవి ప్రేమకథ!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !

# పుష్ప2     # రెయిన్‌బో     # రష్మికమందన్నా    

trending

View More