’ఓం శాంతి ఓం’ విడుదలైనప్పుడు నెగిటివ్ రివ్యూలు : ఆనాటి అనుభవాలను పంచుకున్న దీపికా పడుకొణె
2 months ago | 5 Views
బాలీవుడ్‌లో నా తొలి చిత్రం 'ఓం శాంతి ఓం’ విడుదలైనప్పుడు, కొన్ని నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. అందులో ఒక రివ్యూ నన్నెంతో బాధించింది. నా పని నేను పూర్తిస్థాయిలో చేసేలా చేసింది. నా యాస, మాట తీరు, ప్రతిభ, సామర్థ్యాల గురించి అందులో చర్చించారు. ఆవిధంగా నన్ను నేను మార్చుకున్నానని బాలీవుడ్ నటి దీపికా పదుకొణె తాజాగా ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇందులో తన కెరీర్ గురించి మాట్లాడారు. కెరీర్ ఆరంభంలోనే తాను ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నానని చెప్పారు. ముఖ్యంగా తన తొలి సినిమా 'ఓం శాంతి ఓం’ రిలీజ్ అయ్యాక.. అందులో తన మాట తీరు చూసి చాలామంది తీవ్ర విమర్శలు చేశారని చెప్పారు. ఆ సినిమాకు వచ్చిన రివ్యూలు చదివి.. తనని తాను ఎంతో మార్చుకున్నానని తెలిపారు. ‘ నెగిటివ్ రివ్యూలు కూడా ఒక్కోసారి మనకు మంచే చేస్తాయి.
దానిని మనం తీసుకునే విధానంలో ఉంటుంది‘ అని ఆమె చెప్పారు. షారుక్ ఖాన్ కథానాయకుడిగా నటించిన 'ఓం శాంతి ఓం’లో దీపిక పాత్రకు వేరే నటి డబ్బింగ్ చెప్పింది. దీపిక లుక్స్‌తో ఆ వాయిస్‌కు ఏమాత్రం పొంతన కుదరలేదని అప్పట్లో పలువురు విశ్లేషకులు పేర్కొన్నారు. ’ఐశ్వర్య’ అనే కన్నడ చిత్రంతో నటిగా తెరంగేట్రం చేసిన దీపికా పదుకొణె.. ’ఓం శాంతి ఓం’తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. అనంతరం ఆమె బాలీవుడ్‌లోనే సెటిల్ అయ్యారు. అగ్ర, యువ హీరోల చిత్రాల్లో యాక్ట్ చేసి స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నారు. బాలీవుడ్ నటుడు రణ్‌వీర్‌సింగ్‌ను వివాహం చేసుకున్న ఆమె.. ఇటీవల పాపకు జన్మనిచ్చారు. ఆమె నటించిన ’సింగమ్ అగైన్’ విడుదలకు సిద్ధంగా ఉంది. రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో దీపిక పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. నవంబర్ 1న ఇది విడుదల కానుంది.
ఇంకా చదవండి:"ఝాన్సీ ఐపీఎస్" మూవీ తెలుగు రైట్స్ దక్కించుకున్న ఆర్కే ఫిలిమ్స్ అధినేత డాక్టర్ ఆర్కే గౌడ్