నిహారిక! ఈ విజయానికి నువ్వు అర్హురాలివి.. నీ టీమ్‌తో కలిసి నువ్వు పడ్డ కష్టం, నిబద్ధత స్ఫూర్తినిస్తున్నాయి - ‘కమిటీ కుర్రోళ్ళు’కి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రశంస
4 months ago | 68 Views
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ సంతోషానికి అవధులు లేవు. తన సోదరి నిహారిక కొణిదెల సక్సెస్‌పై ఆయన ఆనందాన్ని మాటల రూపంలో వ్యక్తం చేశారు. నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమాకు యదు వంశీ దర్శకుడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ఆగస్ట్ 9న వంశీ నందిపాటి విడుదల చేశారు. డిఫరెంట్ కంటెంట్‌తో ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్, అటు యూత్‌ను ఆకట్టుకున్న ఈ చిత్రం మండే టెస్ట్ కూడా పాస్ అయ్యింది. నాలుగు రోజుల్లోనే రూ.7.48 కోట్లు వసూళ్లను సాధించి అన్నీ ఏరియాస్‌లో సినిమా బ్రేక్ ఈవెన్ సాధించటం విశేషం.
‘ నిహారిక ‘కమిటీ కుర్రోళ్ళు’ అద్భుతమైన విజయం సాధించినందుకు అభినందనలు. ఈ విజయానికి నువ్వు అర్హురాలివి. నీ టీమ్‌తో నువ్వు పడ్డ కష్టం, పనిలో చూపించిన నిబద్ధత స్ఫూర్తిని కలిగిస్తుంది. మీ టీమ్ చేసిన ప్రయత్నానికి హ్యాట్యాఫ్. ఈ కథకు జీవాన్ని పోసిన దర్శకుడు యదు వంశీకి ప్రత్యేకమైన అభినందనలు’ అని పేర్కొన్నారు రామ్ చరణ్.
మంచి పల్లెటూరి వాతావరణంలో స్నేహం, ప్రేమ, కుటుంబంలోని భావోద్వేగాలను ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రంలో చక్కగా ఆవిష్కరించారు. సీనియర్ నటీనటులతో పాటు 11 మంది హీరోలు, నలుగురు హీరోయిన్స్‌ను తెలుగు సినిమాకు పరిచయం చేస్తూ మేకర్స్ చేసిన ఈ ప్రయత్నాన్ని అభినందిస్తూ ప్రేక్షకులు సినిమాను ఆదరించారని ట్రేడ్ వర్గాలంటున్నాయి. సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందని చిత్ర యూనిట్ తెలియజేసింది.
ఇంకా చదవండి: మళయాళ బ్యూటీల నటపథం.. పాత్ర చిన్నదైనా నటనకు సై
# Committeekurrollu # Sandeepsaroj # Tejaswirao