మమ్ముట్టితో జతకట్టిన నయనతార!
5 months ago | 44 Views
ఈ ఏడాది ప్రారంభంలో ’భమయుగం’తో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఆకట్టుకున్నారు.ఆ చిత్రంతో మరోసారి తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకున్నారు. ఆ తర్వాత ’టర్బో’ చిత్రంతో హంగామా చేశారు. ప్రస్తుతం మరో మూడు మలయాళ చిత్రాలతో బిజీగా ఉన్నారు. తాజాగా గౌతమ్ వాసుదేవ్ విూనన్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని పట్టాలెక్కించారు. మలయాళంలో ఆయన దర్శకత్వం వహిస్తున్న తొలి చిత్రమిది. ముమ్ముట్టి నిర్మాణంలో తెరకెక్కుతోంది. ఇటీవల ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించారు. ఇందులో నయనతార కథానాయికగా నటిస్తోంది, మమ్ముట్టితో ఆమె నటిస్తున్న మూడో చిత్రమిది.
గౌతమ్ విూనన్ ఎంచుకునే కథలు భిన్నంగా ఉంటాయి. ప్రేమకథలు తెరకెక్కించడంతో మాస్టర్ అయిన విూనన్ ఈసారి ఎలాంటి కథ ఎంచుకున్నారన్నది, నయన, మమ్ముట్టి జంట తెరపై ఎలా కనిపిస్తారనేది కూడా ఆసక్తికరంగా ఉంది.అనంత్ అంబానీ, రాధిక మర్చెంట్‌ల వివాహానికి హాజరయ్యారు నయనతార, విఘ్నేశ్ శివన్ దంపతులు. అక్కడ సంప్రదాయ దుస్తుల్లో మెరిశారీ జంట. ఆ ఫొటోలను సోషల్ విూడియాలో పోస్ట్ చేశారు నయన్. ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ప్రస్తుతం నయన్ చేతిలో తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో పది చిత్రాలున్నాయి.
ఇంకా చదవండి: పేక మేడలు మూవీ పెయిడ్ ప్రీమియర్స్ 50 రూపాయలకే అంటున్న హీరో వినోద్ కిషన్ - జూలై 19న సినిమా విడుదల
# Nayanthara # Mammootty # Socialmedia