నయనను మాజీ ప్రియుడు యాక్టింగ్‌ చేయవద్దన్నాడట..!

నయనను మాజీ ప్రియుడు యాక్టింగ్‌ చేయవద్దన్నాడట..!

1 month ago | 5 Views

లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార ప్రొఫెషనల్‌గా ఎంత పాపులారిటీ సంపాదించుకుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. గతంలో పర్సనల్‌ లైఫ్‌కు సంబంధించి రిలేషన్‌ షిప్స్‌తో తరచూ వార్తల్లో ఉంటూ టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలిచేది. ప్రస్తుతం సక్సెస్‌ఫుల్‌గా విగ్నేష్ శివన్ తో వైవాహిక జీవితాన్నిఎంజాయ్‌ చేస్తోంది నయనతార. అయితే నటుడు, కొరియోగ్రాఫర్ ప్రభుదేవాతో చాలా ఏండ్ల క్రితం రిలేషన్‌ షిప్‌లో ఉన్న ఈ భామ 2011లో పెండ్లికి కూడా రెడీ అయిందని.. వెడ్డింగ్‌కు కొన్ని రోజుల ముందే ప్రభుదేవా-నయనతార విడిపోయారని వార్తలు వచ్చాయని తెలిసిందే. నెట్‌ఫ్లిక్స్‌ డాక్యుమెంటరీలో రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పటి ఆసక్తికర విషయాన్ని షేర్‌ చేసుకుంది. తెలుగులో వచ్చిన 'శ్రీరామరాజ్యం' తన చివరి సినిమా అనుకున్నానంది నయనతార .


తాను సినిమాలను విడిచిపెట్టాలని ఎప్పుడూ కోరుకోలేదని.. అయితే తన మాజీ బాయ్‌ఫ్రెండ్‌ తనను పెళ్లి చేసుకోవాలంటే యాక్టింగ్‌ వదిలేయాలని షరతు పెట్టినట్లు చెప్పింది. పెళ్లికి ముందు నటించడం మానేయమని అప్పటి తన ప్రియుడు కండిషన్‌ పెట్టాడని స్పష్టం చేసింది. దివంగత లెజెండరీ దర్శకుడు బాపు డైరెక్ట్‌ చేసిన 'శ్రీరామరాజ్యం'లో నయనతార సీతగా నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్‌ చివరి రోజున ఇదే తన చివరి సినిమా అని భావోద్వేగానికి కూడా లోనైంది. అయితే ఆ తర్వాత మాత్రం అలాంటి షరతులేమి లేకుండా సినిమాల్లో సక్సెస్‌ఫుల్‌గా ప్రయాణాన్ని కొనసాగిస్తోంది నయనతార. మొత్తానికి సినిమాలు వద్దని చెప్పింది ప్రభుదేవానే అంటూ పరోక్షంగా హింట్‌ ఇచ్చేసిందని ఇండస్ట్రీ అంతా తెగ చర్చ నడుస్తోంది.

ఇంకా చదవండి: హాయ్‌.. నేను రానా దగ్గుబాటి.. ట్రైలర్‌ షో విడుదల

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !
# నయనతార     # విగ్నేష్ శివన్    

trending

View More