ధనుష్‌పై నయన విమర్శలు
1 month ago | 5 Views
లేడి సూపర్ స్టార్ నయనతార తమిళ అగ్ర కథానాయకుడు ధనుష్‌పై విమర్శలు గుప్పించింది. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన తన డాక్యుమెంటరీలో నేను నటించిన నానుమ్ రౌడీ దాన్( తెలుగులో నేను రౌడీనే) పాటలు వినియోగించుకోవడానికి అవకాశం ఇవ్వకపోగా.. రూ.10 కోట్లు డిమాండ్ చేస్తున్నాడని తెలిపింది. ఈ సందర్భంగా బహిరంగ లేఖను ఎక్స్ వేదికగా విడుదల చేసింది. నయనతార, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం నానుమ్ రౌడీ దాన్. ఈ సినిమాకు నయనతార భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించగా.. వండర్ బేర్స్ బ్యానర్‌పై ధనుష్ ఈ సినిమాను నిర్మించాడు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ సినిమాలోని సాంగ్స్ ఎంత పెద్ద హిట్ అయ్యయ్యో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే రీసెంట్‌గా నయనతారపై నెట్‌ఫ్లిక్స్ ఒక డాక్యుమెంటరీని విడుదల చేసింది. దీనికి సంబంధించిన ప్రోమోలో నానుమ్ రౌడీ దాన్ సినిమాలోని పాటలను నయనతార వాడుకున్నందుకు ధనుష్ నయనతారకు నోటీసులు పంపినట్లు తెలుస్తుంది.
అంతేగాకుండా రూ.10 కోట్లు డిమాండ్ చేసినట్లు సమాచారం. ఇదే విషయంపై నయనతార ప్రస్తావిస్తూ.. మీరు మీ తండ్రి, సోదరుడి సాయంతో హీరో అయ్యారు. నేను నా రెక్కల కష్టంతో పైకొచ్చాను. నా జీవితంపై నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ తీస్తోంది. అందులో మీరు నిర్మించిన నానుమ్ రౌడీ దాన్ సినిమాలోని సన్నివేశాలు వాడుకునేందుకు ఎన్‌వోసీ అడిగితే రెండేళ్ల నుంచి తిప్పించుకుంటున్నారు. 3 సెకన్లకు రూ.10 కోట్లు కట్టాలా?’ అని ధనుష్‌పై విమర్శలు గుప్పించింది.
ఇంకా చదవండి: 'కలర్‌ఫొటో' దర్శకిడి నిశ్చితార్థం
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !
# ధనుష్ # నయనతార # డాక్యుమెంటరీ